తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (అక్టోబరు 31 - నవంబర్​ 06) - రాశి ఫలాలు

ఈ వారం (అక్టోబరు 31 - నవంబర్​ 06) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

Horoscope weekly updates
రాశి ఫలాలు ఈవారం

By

Published : Oct 31, 2021, 4:24 AM IST

ఈ వారం (అక్టోబరు 31 - నవంబర్​ 06) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

ముఖ్యకార్యాల్లో శ్రద్ధ అవసరం, ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. పట్టుదలతో పని పూర్తి చేయాలి. వ్యాపార లాభం సూచితం. ధనయోగం ఉంది. ఒత్తిడి కలిగించే వారున్నారు. సంయమనాన్ని కోల్పోకూడదు. కుటుంబ సభ్యుల సలహాను ఆచరించాలి. సాంకేతికంగా ఎదుగుదలకు అవకాశముంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. సూర్యారాధన మంచిది.

కార్యసిద్ధి సంతృప్తినిస్తుంది. ప్రతిదీ లోతుగా విశ్లేషించండి. ఉద్యోగఫలాలు అద్భుతంగా ఉంటాయి. అధికార లాభం ఉంటుంది. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆపదల నుంచి బయటపడతారు. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. గృహ భూ లాభాలకు అవకాశముంది. శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదేవతారాధన శుభప్రదం.

నోబలం ముందుకు నడిపిస్తుంది. అడ్డంకులు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తద్వారా సమాజంలో ఖ్యాతి లభిస్తుంది. స్థిర సంపాదన ఏర్పడుతుంది. సహోద్యోగులతో విభేదాలు రానీయవద్దు. సౌమ్యంగా సంభాషించాలి. భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి నిలపాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే శుభం కలుగుతుంది.

నుకున్నది నెరవేరుతుంది. లక్ష్యం దగ్గరలోనే ఉంది. అఖండమైన ఖ్యాతి లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు సూచితం, తగు శ్రద్ధ వహించండి. సొంత నిర్ణయం కొంత శ్రమ కలిగిస్తుంది. వారం మధ్యలో ఒక అంశం సంతృప్తినిస్తుంది. వ్యయభారం పెరిగే అవకాశముంది. సకాలంలో నిర్ణయం తీసుకోవాలి. లక్ష్మీధ్యానంతో మంచి జరుగుతుంది.

శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. కోరికలు నెరవేరతాయి. ఎటుచూసినా ఉత్తమ ఫలితమే గోచరిస్తోంది. ఉద్యోగంలో పెద్దల ప్రశంసలూ పదవీ లాభముంటాయి. పదిమందికీ ఉపయోగపడతారు. దైవానుగ్రహం లభిస్తుంది. వ్యాపారయోగం బాగుంది. ఇంట్లో వారికి మీవల్ల మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు.

దృష్టయోగముంది. సకాలంలో పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. అధికారుల అనుగ్రహం లభిస్తుంది. వ్యాపారంలో మెలకువలు తెలుస్తాయి. ధనధాన్య లాభముంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. లక్ష్యాన్ని చేరేవరకు శాంతంగా వ్యవహరించాలి. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది.

ర్థికాంశాలు శుభప్రదం. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. సౌమ్యంగా పరిష్కరించండి. దేనికీ తొందరపడవద్దు. శాంతంగా ఆలోచించాలి. సహనానికి పరీక్షా కాలంగా అనిపిస్తుంది. ఒత్తిడిని జయించాలి. వారం మధ్యలో ఒక పనిలో లాభముంటుంది. విష్ణుమూర్తిని దర్శించండి, ఆశయం నెరవేరుతుంది.

మంచి కాలం నడుస్తోంది. అభీష్టసిద్ధి ఉంటుంది. ఉద్యోగరీత్యా అనుకూల సమయం. వ్యాపారంలో అధికలాభాలను పొందుతారు. ఇంటా బయటా కలిసివస్తుంది. పేరు ప్రతిష్ఠలుంటాయి. బంగారు భవిష్యత్తునిచ్చే గొప్ప పనులను ప్రారంభించండి. కాలం సహకరిస్తుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయస్వామిని దర్శిస్తే మేలు.

దృష్టవంతులవుతారు. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. సంపాదన స్థిరంగా ఉంటుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. వ్యాపారంలో జాగ్రత్త. గృహయోగం ఉంది. పరిస్థితులు చక్కబడతాయి. కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో శుభం జరుగుతుంది. ఒక వార్త శక్తినిస్తుంది. దుర్గాస్తుతితో కాలం ఆనందంగా గడుస్తుంది.

కాలం మంచి పనులకు సహకరిస్తుంది. ముఖ్య కార్యాలను త్వరగా పూర్తిచేయండి. ఉద్యోగఫలితం శుభప్రదం. శాంత స్వభావంతో కార్యాలను సాధిస్తారు. దగ్గరివారి సలహాలు మేలుచేస్తాయి. కలహాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత విషయాలను ఇతరుల వద్ద ప్రస్తావించవద్దు. శివ నామ స్మరణతో అంతా మంచి జరుగుతుంది.

త్సాహంగా పని ప్రారంభించాలి. తెలియని అవరోధాలుంటాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. ఉద్యోగంలో అనుకున్న ఫలితం వస్తుంది. చెడు ఊహించవద్దు. శ్రద్ధతో లక్ష్యాన్ని చేరాలి. కుటుంబ సభ్యుల సలహాతో సరైన నిర్ణయం తీసుకోండి. చిన్న పొరపాటు జరిగినా సమస్య చేయి దాటుతుంది. మొత్తంమీద కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విష్ణుదర్శనం మేలు చేస్తుంది.

ద్భుతమైన విజయం ఉంది. సకాలంలో పని పూర్తిచేస్తే విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఎదురుచూస్తున్న ఫలితం వస్తుంది. వ్యాపారంలో బాగుంటుంది. ధనలాభం ఉంది. ఎదుటివారు ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. సమయస్ఫూర్తి కాపాడుతుంది. నూతన కార్యాలకు బాటలు వేయండి, భవిష్యత్తులో చక్కని ఫలాలనిఇస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details