ఈ వారం (అక్టోబరు 24 - అక్టోబరు 30) రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు మీకోసం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
వ్యాపార లాభముంటుంది. ఆర్థికంగా ఎదుగుదల సూచితం. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం. ధైర్యంగా ముందడుగేయండి. అంతా సవ్యంగా జరుగుతుంది. ముఖ్యకార్యాల్లో శ్రమ పెరుగుతుంది. స్పష్టంగా మాట్లాడండి. కుటుంబ సహకారంతో విఘ్నాలు తొలగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. వారాంతంలో శుభం జరుగుతుంది. సూర్యనమస్కారం శక్తినిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఉద్యోగంలో శుభఫలితం ఉంది. ఉత్సాహంగా పని చేయండి. ఆపదలు తొలగుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తుకు పునాది అవుతుంది. గతంలో కాని పనులు ఇప్పుడవుతాయి. నూతన బాధ్యతలు చేపడతారు. ఇంట్లో మనశ్శాంతి లభిస్తుంది. సంతృప్తినిచ్చే అంశాలున్నాయి. స్థిరత్వం వస్తుంది. ప్రయాణ లాభముంటుంది. విష్ణుస్మరణ మంచిది.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారం శుభప్రదం, ఆర్థికస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగంలో ఆటంకాలున్నాయి. ముఖ్యమైన అంశాల్లో ఏకాగ్రతను పెంచండి. ఆటంకపరిచే వారున్నారు. దైవానుగ్రహంతో ఒకపని పూర్తిచేస్తారు. వ్యయం తగ్గించండి. ఒకమెట్టు దిగి అయినా పని పూర్తి చేసుకోవాలి. ఇష్టదేవతను స్మరించండి, శుభవార్త వింటారు.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అంచెలంచెలుగా పైకి వస్తారు. అభీష్టసిద్ధి ఉంది. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. దగ్గరివారితో విభేదాలు వద్దు. మీ మంచితనంతో పదిమందికీ ఆదర్శం అవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఉత్తమకాలం నడుస్తోంది. బ్రహ్మాండమైన శుభయోగాలున్నాయి. అన్నివిధాలా కలిసివస్తుంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. సరైన ప్రణాళిక అవసరం. సమస్యలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ధర్మమార్గంలో విజయం లభిస్తుంది. సంతృప్తినిచ్చే అంశం ఒకటుంది. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. ఇష్టదేవతారాధన మంచిది.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)
లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో బాగుంటుంది. వాస్తవస్థితికి దగ్గరగా ఆలోచించండి, సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నిజాయతీ ముందుకు నడిపిస్తుంది. క్రమంగా ఆశయం నెరవేరుతుంది. చంచల నిర్ణయాలు వద్దు. అధికారలాభముంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలుంటాయి. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మేలు జరుగుతుంది.