నేటితరం యువత.. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జీవితం నుంచి ప్రేరణ పొందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఫలితంగా పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక, లింగ వివక్ష సమాజం, అవినీతిని పారద్రోలాలని యువతను కోరారు.
దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగినవారే ఉన్నారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నవ భారత నిర్మాణం కోసం.. యువత ముందుండి నాయకత్వం వహించాలన్నారు. దేశంలో ప్రతి పౌరుడికి సమానావకాశాలు లభించడం సహా.. ఎలాంటి వివక్షలు లేనప్పుడే ఆనందాయకమైన, సంపన్నమైన దేశంగా భారత్ నిలుస్తుందని ప్రసంగించారు వెంకయ్య.