ఇద్దరు యువకులపై బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ(బీబీఎంపీ) సిబ్బంది దాడి చేశారు. కరోనా టెస్టు చేయించుకునేందుకు వారు నిరాకరించడమే ఇందుకు కారణం. టీకా కోసం వచ్చిన ఇద్దరు యువకులు చాలా సేపు లైన్లో పాడిగాపులు కాశారు. తీరా అది టీకా కేంద్రం కాదు, కొవిడ్ పరీక్షా కేంద్రం అని తెలిసే సరికి మెల్లగా అక్కడి నుంచి జారుకునేందుకు యత్నించారు.
అంత సేపు క్యూలో నిలబడి వెనక్కి వెళ్తున్న వీరిని గమనించిన బీబీఎంపీ సిబ్బంది మర్యాదగా కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వారు ససేమిరా అనడం వల్ల బలవంతంగా పరీక్ష కేంద్రం వద్దకు లాక్కెళ్లారు. టెస్ట్ చేయించుకునేందుకు యువకులు నిరాకరించడం వల్ల వారిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. యువకులపై చేయి చేసుకున్న అధికారులపై కేసు నమోదైంది.