తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అన్నయ్యకు కాబోయే భార్యపై హత్యాచారం - ఆత్మహత్య చేసుకొన్న కుటుంబం

బిహార్​లో అన్నయ్యకు కాబోయే భర్తపై ఓ యువకుడు కన్నేశాడు. ఆమెతో మంచిగా మాట్లాడి ఓ హోటల్​కు తీసుకువెళ్లి అత్యాచారం చేసి.. హత్య చేశాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. నవంబర్​ 16న ఈ దారుణం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Etv Bharat
వదినపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు

By

Published : Dec 23, 2022, 2:06 PM IST

బిహార్​లో ఓ కామాంధుడు అన్నకు కాబోయే భార్యపై అత్యాచారం చేసి.. హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలు బయటకు రాకుండా ఉండటానికి పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసి మరీ దానిపై ఉప్పు చల్లాడు. ఈ దారుణమైన ఘటన నవంబర్​ 16న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జహానాబాద్ జిల్లాలోని అర్వాల్​ ప్రాంతానికి చెందిన ఓ యువతికి అదే జిల్లాకు చెందిన ఓ యువకుడితో పెద్దలు వివాహం నిశ్చయించారు. దీంతో ఆ యువతి.. కాబోయే భర్త కుటుంబ సభ్యులతో​ ఫోన్​లో మాట్లాడేది. అదే సమయంలో కాబోయే భర్త సోదరుడితో కూడా సాధారణ సంభాషణ జరిపేది. దీంతో ఆ యువకుడు.. నవంబర్​ను 16న కాబోయే వదినను జహానాబాద్​లోని ఓ హోటల్​కు రావాలని కోరాడు. అతడ్ని కూడా తన కుటుంబ సభ్యుడిలానే భావించిన ఆ యువతి అక్కడకు వెళ్లింది. అనంతరం యువకుడు కాబోయే వదినపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన యువతిని హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పట్నాలోని జనీపుర్​కు తెచ్చి ఓ ప్రాంతంలో పాతిపెట్టాడు. మృతదేహం త్వరగా పాడవదేమో అనే సందేహంతో.. మళ్లీ దాన్ని బయటకు తీసి దానిపై 10కేజీల ఉప్పును వేసి పూడ్చి పెట్టాడు.

అయితే మృతురాలి తండ్రి కాబోయే అల్లుడి సోదరుడిని.. తమ కుమార్తె ఎక్కడని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో యువతి తండ్రి నవంబర్​ 25న తన కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతికి కాబోయే భర్త సోదరుడిపై అనుమానంతో అదుపులోకి తీసుకొన్నారు. అతడిని విచారించగా తానే హత్య చేసినట్లు వెల్లడించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

పెళ్లైన మూడు నెలలకే కుటుంబంతో సహా ఆత్మహత్య..
కర్ణాటకలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. వీరిలో మూడు నెలల క్రితం వివాహం జరిగిన దంపతులతో సహా వరుడి తల్లి కూడా ఉంది. ఈ దారుణం హవేరిలోని అగాడి ప్రాంతంలో జరిగింది.
మూడు నెలలు క్రితం.. భారతీ కమడొల్లీ అనే మహిళ కుమారుడు కిరణ్​.. సౌజన్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి యువతి కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. అప్పటి నుంచి యువతి కుటుంబసభ్యులు.. యువకుడి ఫ్యామిలీని బెదిరించడం మొదలుపెట్టారు. వారి బెదిరింపులతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్..
కర్ణాటకలో విద్యార్థినులు పట్లు అసభ్యంగా ప్రవర్తించిన ఓ స్కూల్​ ప్రిన్సిపల్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. హాసన్​ ప్రాంతంలోని అరకలగూడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొరార్జీ దేశాయ్ బాలికల పాఠశాలలో చైల్డ్​ హెల్ప్​ లైన్​ ఆధ్వర్యంలో డిసెంబర్​ 18న.. గుడ్​ అండ్​ బ్యాడ్​ టచ్​ గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఆ కార్యక్రమంలో కొందరు బాలికలు తమ ప్రిన్సిపల్​ తమతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెల్లడించారు. వెంటనే చైల్డ్​ హైల్ప్​ లైన్​ వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ప్రిన్సిపల్​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

మట్టిపెళ్లలు కూలి ముగ్గురు మృతి..
హరియాణాలో ఘోర ప్రమాదం జరిగింది. హీసర్​ ప్రాంతంలో మురుగు కాలువ కోసం తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు కూలీలు మృతి చెందారు. తవ్వకాలు జరుపుతున్న వారిపై ఒక్కసారిగా మట్టి పెళ్లలు విరిగి పడడం వల్ల వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం వాటిని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. మృతులంతా బిహార్ వాసులుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details