తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా ఎమ్మెల్యేకు 'వలపు వల'.. వాట్సాప్​లో న్యూడ్ వీడియో​ కాల్​! - కర్ణాటక చిత్రదుర్గం వాట్సాప్​ వీడియో కాల్​ కేసు

ప్రముఖులనే టార్గెట్ చేస్తూ.. కొందరు మహిళలు వలపు వల విసురుతారు. నగ్నంగా వీడియోకాల్ చేసి​ కవ్విస్తారు. వాటికి స్పందించని వారికి.. ఫోర్న్​ వీడియోలు పంపి రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ అనుభవం.. కర్ణాటకలోని ఓ భాజపా ఎమ్మెల్యేకు ఎదురైంది. దీనిపై ఆయన వెంటనే.. సైబర్​ పోలీసులకు సమాచారం అందించారు.

Young woman tried to honey-trap
చిత్రదుర్గంలోని భాజపా ఎమ్మెల్యే తిప్పారెడ్డి

By

Published : Nov 2, 2022, 4:04 PM IST

ఓ మహిళ తనను హనీట్రాప్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ కర్ణాటకకు చెందిన భాజపా ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు. చిత్రదుర్గం శాసనసభ్యుడు తిప్పారెడ్డి.. తన వాట్సాప్​ నంబర్​​కు ఓ మహిళ నగ్నంగా వీడియో కాల్​ చేసిందని పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు​ చేశారు. ఇది రాజకీయ ప్రత్యర్థుల పనిగా కొందరు అనుమానిస్తున్నారు. అయితే సీనియర్​ నేతను.. హనీట్రాప్​లోకి దించేందుకు ఓ ముఠా ప్రయత్నించిందని.. ఈ ఫిర్యాదుతో వారిపైన ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

అసలు ఏం జరిగిందంటే?
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. తిప్పారెడ్డికి అక్టోబర్​ 31న గుర్తుతెలియని నంబర్​ నుంచి ఓ వాయిస్ ​కాల్​ వచ్చింది. దానికి స్పందించిన ఆయనకు వెంటనే.. అదే నంబర్​ నుంచి వాట్సాప్​లో వీడియోకాల్​ వచ్చింది. దాన్ని కూడా ఆన్సర్ చేయగా.. వీడియోలో ఉన్న మహిళను చూసి ఒక్కసారిగా షాక్​కు గురైయ్యారు. కాల్​లో ఉన్న మహిళ హిందీలో మాట్లాడుతూ.. నగ్నంగా ఉంది. వెంటనే ఎమ్మెల్యే ఆ కాల్​ను కట్​ చేశారు. అయితే.. కాల్​ కట్​ అయిన వెంటనే ఆ నంబర్ నుంచి కొన్ని పోర్న్​ వీడియోస్​ వచ్చాయి. వెంటనే ఎమ్మెల్యే ఆ నంబర్​ను బ్లాక్​ చేసి చిత్రదుర్గంలోని సైబర్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులే ఈ హనీట్రాప్​కు ప్రయత్నించి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details