అర్ధరాత్రి ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటక బెంగళూరులో వెలుగుచూసింది. బాధితురాలి(Uber Taxi Rape Victim) ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిందితుడైన క్యాబ్ డ్రైవర్(Uber Cab Driver Case) దేవరాజ్‌ను అరెస్టు చేశారు.
అసలు ఏం జరిగింది?
నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో తన స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వెళ్లింది. అనంతరం మురుగేశ్ పాళ్యలోని తన ఇంటికి వెళ్లేందుకు తెల్లవారుజామున 2 గంటలకు క్యాబ్ బుక్ చేసింది. మార్గంమధ్యలో డ్రైవర్ దేవరాజ్ తనపై శారీరకంగా దాడి చేసి, అత్యాచారం చేశాడని ఆ మహిళ(Bengaluru Rape Victim) ఆరోపించింది. నిందితునితో పోరాడి అతని ఫోన్‌ను లాక్కున్నట్లు మహిళ తెలిపింది. క్యాబ్ డ్రైవర్ తప్పించుకున్నాడని.. ఇంటికి చేరుకున్న తాను జేసీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది.