తెలంగాణ

telangana

ETV Bharat / bharat

murder in mancherial: నెట్టింట యువతి పర్సనల్ ఫొటోలు.. బండరాళ్లతో మోది యువకుడిని చంపిన కుటుంబం - ప్రేమిస్తున్నానని వెంటపడ్డ యువకుడు

murder in mancherial district: అందరిలాగే వారి ప్రేమ స్నేహంతోనే మొదలైంది. అది కాస్త చిగురించి ప్రేమకు దారి తీసింది. ఆ అమ్మాయే తన కలల రాకుమారని భావించాడు ఆ అబ్బాయి. తననే పెళ్లి చేసుకోవాలని మనసా వాచా కర్మన భావించాడు. కానీ అన్ని ప్రేమ కథల్లో జరిగినట్లే ఇక్కడ జరిగింది. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి తల్లిదండ్రుల మాట విని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అప్పుడు బయటకొచ్చాడు ఆ ప్రేమికుడులోని దుర్మార్గుడు. ఇన్నాళ్లూ నాలోని ప్రేమనే చూశావ్.. ఇక ద్వేషాన్ని చూస్తావ్ అంటూ తనలోని సగటు మృగాన్ని తట్టిలేపాడు. చివరకు చేయకూడదని పని చేసి దారుణమైన చావును కొనితెచ్చుకున్నాడు.

brutal murder in  indaram mancherial district
పట్టపగలే యువకుడి దారుణ హత్య.. బండరాళ్లతో తలపై మోది

By

Published : Apr 25, 2023, 1:39 PM IST

Updated : Apr 25, 2023, 7:37 PM IST

murder in mancherial district: మంచిర్యాలజిల్లా ఇందారంలో పట్టపగలే ఓ యువకుడు దారుణ హత్య గురయ్యాడు. మహేశ్‌ అనే వ్యక్తి కొన్నాళ్లుగా ఓ వివాహితను వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఆ యువతి కుటుంబ సభ్యులు అతడిని దారుణంగా హతమార్చారు. అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేస్తూ.. రాళ్లతో తల పగులగొట్టారు. ఇదంతా అక్కడున్న చోద్యం చూశారే కానీ ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకని అడిగితే అతడు చేసిన ఓ దుర్మార్గమైన పని చూసి అతడిని కాపాడాలని తమకు అనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు..? ఆ కుటుంబం అతడిని ఎందుకు కొట్టి చంపింది..?

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..మంచిర్యాల జిల్లా ఇందారంలో పట్టపగలే ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మహేశ్ అనే యువకుడిని నలుగురు వ్యక్తులు కత్తితో పొడిచి, తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. వేధింపుల వ్యవహారమే హత్యకు కారణంగా తెలుస్తుంది. ఏడాది క్రితం వరకు మహేశ్ ఓ యువతి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆర్నెళ్ల క్రితం యువతికి మరో యువకుడితో వివాహం జరిగింది.

అప్పటిదాక తనే జీవితమని బతుకున్న మహేశ్.. ఆ అమ్మాయి వేరే అతడిని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేక పోయాడు. ఆ బాధను జీర్ణించుకోలేక క్షణికావేశంలో ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న వీడియోలను సామాజిక మాధ్యమాలలో బహిర్గతం చేశాడు. ఈ వీడియోలను చూసిన యువతి భర్ ఆమెకు విడాకులిచ్చాడు. అంతటితో ఆగకుండా అవమాన భారంతో.. ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య తర్వాత పుట్టింటికి వచ్చిన యువతిని.. మళ్లీ కొన్నాళ్లుగా మహేశ్ వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టికోవట్లేదని కోపంతో బాధిత యువతి కుటుంబీకులు కక్ష పెంచుకున్నారు. అతడి వల్ల తమ కుటుంబం పరువు పోతుందని అవమానకరంగా భావించారు. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఇవాళ ఉదయం పాలు పోసి వస్తుండగా మహేశ్​ను అడ్డగించారు. అనంతరం అతడిని కత్తితో పొడిచి, బండరాయితో మోదీ హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మృతుడు మహేశ్​

మరోవైపు ఈ క్రమంలోనే మహేశ్​ మృతదేహనికి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్​మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామాన్ని తీసుకొచ్చారు. తాము పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు, ఎస్​ఐ రామకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. వారిపై చర్యలు తీసుకునేంతవరకు కదిలేదిలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హమీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

"ఉదయాన్నే పాలు పోసిన అనంతరం.. పెట్రోలు కొట్టించుకుని బైక్​పై వస్తుండగా యువతి కుటుంబ సభ్యులు అతడిని అడ్డగించారు. కత్తులు, రాళ్లతో దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు.అనంతరం పోలీస్ స్టేషన్​కు వచ్చి లొంగిపోయారు." - నరేందర్, ఏసీపీ

ఇవీ చదవండి:

Last Updated : Apr 25, 2023, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details