Young Man Stole From Shop Near Home in Sirisila : చిన్న చోరీ కోసం ఓ ప్రబుద్దుడు వేసిన భారీ స్కెచ్ మాత్రం అందరినీ నవ్విస్తోంది. ఎవరికీ చిక్కకూడదనుకుని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసులు మాత్రం చోరీ(Robbery) గుట్టు రట్టైంది. జల్సాలకు అలవాటు పడి.. ఇంటి కింద ఉన్న రూంలో అద్దెకు ఇచ్చిన ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులో ఇంటి యజమాని కుమారుడు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేటకు చెందిన రామిండ్ల నాంపల్లి భవనంలో అద్దెకు కొన్ని షాపులు నడుస్తున్నాయి. ఓ దుకాణాన్ని సింగారం గ్రామానికి చెందిన బంటి లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఎప్పటిలాగానే రాత్రి తన షాపుకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. మరునాటి ఉదయం 11 గంటలకు వచ్చి చూసే సరికి షాపు వెనక తలుపు తెరిచి ఉండడంతో అనుమానించిన ఆరా తీశాడు. ఈ క్రమంలో తన షాపులో చోరీజరిగిందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ గమనించి పోలీసులకు ఇచ్చారు.
Tomato Theft In Sangareddy : హెల్మెట్ పెట్టుకుని వచ్చి.. టమాటాలను దొంగిలించి..
Man Stole Money From Shop :అయితే సీసీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాలను చూసి మహిళా దొంగ ఎవరని ఆరా తీసే పనిలో పడ్డారు. ఎల్లారెడ్డిపేట ప్రాంతంలో మహిళా దొంగలు ఎంట్రీ ఇచ్చారా..? ఏదైనా ముఠా ఈ ప్రాంతంలో సంచరిస్తుందా అన్న అనుమానంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే ఇందుకు సంబంధించిన సమాచారం మాత్రం లభ్యం కాకపోవడంతో మహిళా దొంగ ఎవరబ్బా అని మల్లగుల్లాలు పడ్డారు.