కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు ఆడ, మగా, చిన్నాపెద్ద అని తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి దారుణ ఘటనే ఇది. ఓ పురుషుడిపై మరో పురుషుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
అసలేం జరిగిందంటే?
బెళగావి జిల్లాకు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు.. హోటల్లో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. రోజులానే అతడు అక్టోబరు 5న తన పని పూర్తయ్యాక.. ఇంటికి తిరిగి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నాడు. ఆ సమయంలో.. అథణి తాలుకాలోని సంకొనట్టి గ్రామానికి చెందిన రాజు అచారకట్టి అక్కడికి బైక్‌పై వచ్చాడు.