తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇన్​స్టాలో లవ్.. ట్రాన్స్‌జెండర్​తో యువకుడి పెళ్లి.. రూ.60లక్షలు కట్నం కోసం డిమాండ్! - ధర్జ్​ జెండర్​తో యువకుడి పెళ్లి

Marriage With Transgender : ఇన్​స్టాగ్రామ్​లో చాటింగ్ చేస్తూ ట్రాన్స్‌జెండర్ ప్రేమలో పడిన ఓ యువకుడు.. కుటుంబ సభ్యులను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఇష్టం లేని యువకుడి కుటుంబ సభ్యులు.. దంపతులపై దాడికి తెగబడ్డారు. ట్రాన్స్‌జెండర్​ను రూ.60 లక్షలు కట్నం తీసుకురమ్మని ఆదేశించారు. దీంతో దంపతులిద్దరు పోలీసులను ఆశ్రయించారు. బిహార్ రాజధాని పట్నాలో ఈ ఘటన జరిగింది.

young-man-married-transgender-in-bihar-in-laws-demand-60-lakhs-in-dowry-marriage-with-transgender-in-patna
ట్రాన్స్‌జెండర్​తో యువకుడి పెళ్లి

By

Published : Jul 25, 2023, 5:19 PM IST

Updated : Jul 25, 2023, 5:27 PM IST

Marriage With Transgender : ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమైన ట్రాన్స్‌జెండర్​తో ప్రేమలో పడ్డాడు ఓ యువకుడు. అనంతరం కుటుంబ సభ్యులను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి ఇష్టంలేని యువకుడి కుటుంబ సభ్యులు.. ఇంటికొచ్చిన దంపతులపై దాడి చేశారు. అక్కడి నుంచి వారిని వెళ్లగొట్టి.. చంపేస్తామని బెదిరించారు. ట్రాన్స్‌జెండర్ నుంచి రూ.60 లక్షల కట్నం డిమాండ్ చేశారు. దీంతో బాధితులిద్దరు పోలీసులను ఆశ్రయించారు. బిహార్​లో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని పట్నాలోని దానాపుర్ ప్రాంతానికి చెందిన రవికి రెండు సంవత్సరాల క్రితం.. దర్భంగకు చెందిన అధికా చౌదరి అనే ఓ ట్రాన్స్‌జెండర్ ​ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమైంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు అప్పుడప్పుడు హోటళ్లలోనూ కలుసుకునేవారు. చివరగా వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని రవి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీనికి వారు ఒప్పుకోలేదు. అనంతరం జున్​ 25న.. స్థానికంగా ఉన్న ఓ గుడిలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం భార్యతో కలిసి ఇంటికెళ్లిన రవిపై అతడి కుటుంబ సభ్యులు దాడి చేశారు. అధికా చౌదరిపైనా దాడికి తెగబడ్డారు. ఇద్దరినీ ఇంట్లో నుంచి గెంటేశారు. రూ.60 లక్షలు కట్నం తెస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టాలని అధికను బెదిరించారు. లేదంటే చెంపేస్తామని హెచ్చరించారు.

ట్రాన్స్‌జెండర్​ను పెళ్లి చేసుకున్న యువకుడు.

"అధికను పెళ్లి చేసుకోవడం నా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. నా నిర్ణయాన్ని వారు ఒప్పకోలేదు. అధికను ఇంట్లోకి కూడా తీసుకువచ్చేందుకు వారు ఒప్పుకోలేదు. అన్న ధంజయ్ సింగ్​ నన్ను కొట్టాడు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. అధికను పెళ్లి చేసుకున్నా. ఈ సమాజంలో విలువలు పడిపోయాయి. ఏం చేసినా తప్పు అంటారు. ఏం చేయకపోయినా తప్పు అంటారు. అవన్నీ నేను పట్టించుకోను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను" రవి తెలిపాడు.

జులై 12న బైక్​పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. తనను చంపేందుకు ప్రయత్నించారని రవి ఆరోపించాడు. వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడని వెల్లడించాడు. అధిక పట్ల తన కుటుంబ సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారని రవి వివరించాడు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు ఆ దంపతులు. తండ్రి సత్యేంద్ర సింగ్, తల్లితో పాటు అన్న ధంజయ్ సింగ్​పై వారికి ఫిర్యాదు చేశారు. తమను చంపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. తన భార్య అధికా చౌదరిని కిడ్నాప్ చేసి.. చంపేందుకు కుట్ర చేస్తున్నారని రవి వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన దానాపుర్​ పోలీసులు.. విచారణ జరుగుతోందన్నారు.

Last Updated : Jul 25, 2023, 5:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details