తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్నేహితుల మధ్య గొడవ.. నడిరోడ్డుపై హత్య - young man killed in ghaziabad

మద్యం మత్తులో ఓ యువకుడిని తోటి స్నేహితులే కిరాతకంగా కొట్టిచంపారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.

Young man beaten to death in ghaziabad
స్నేహితుల మధ్య వివాదం

By

Published : May 18, 2021, 2:07 PM IST

Updated : May 18, 2021, 3:58 PM IST

యువకుడిని కొట్టిచంపిన తోటి స్నేహితులు

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని మురద్​నగర్​లో దారుణం జరిగింది. స్నేహితుల మధ్య నెలకొన్న వివాదం ఓ యువకుడిని బలి తీసుకుంది. మద్యం మత్తులో ఉన్న తోటి స్నేహితులు ఆ యువకుడిని కర్రలతో కిరాతకంగా కొట్టి చంపారు.

యువకుడిపై దాడి

ఏం జరిగింది?

మురద్​నగర్​కు చెందిన సోను ఓ డైవర్. గంగానదిలో మునిగిపోతున్న చాలా మందిని కాపాడాడు. తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఆ తర్వాత వారి మధ్య వివాదం తలెత్తింది. దీంతో మిగతా స్నేహితులు సోనును కర్రలతో కిరాతకంగా కొట్టి చంపారు. ఈ వీడియో వైరల్​గా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే ఒకరిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల అదుపులో నిందితుడు

ఇదీ చదవండి :తౌక్టేకు 'మహా'లో 11మంది బలి -వేల ఇళ్లు ధ్వంసం

Last Updated : May 18, 2021, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details