తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పురుషులకు దీటుగా.. అర్చక వృత్తిలో యువతి - వేదాలను నేర్చుకున్న బాలిక

బాలికలు వేదాధ్యయనం, అర్చకత్వంలో కనిపించడం చాలా అరుదు. అయితే, కర్ణాటక, దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఓ యువతి ఇష్టపూర్వకంగా అర్చకత్వాన్ని అభ్యసిస్తోంది.

priesthood
అర్ఛక వృత్తిలో బాలిక

By

Published : Jun 27, 2021, 8:37 PM IST

అర్ఛక వృత్తిలో యువతి

పురుషులకు దీటుగా వేదాలను, అర్ఛకత్వాన్ని నేర్చుకుంటోంది కర్ణాటకకు చెందిన ఓ యువతి. ఇష్టపూర్తిగానే ఈ వృత్తిని ఎంచుకున్నట్లు చెబుతోంది.

అర్చకత్వం పాటిస్తున్న రాష్ట్ర హిందూ మత మండలి సభ్యుడు కాశెకోడి సూర్యనారాయణ భట్ కుమార్తె అనాఘా. వారిది బ్రాహ్మణ కుటుంబం అయినందున తల్లిదండ్రుల నుంచి యువతి స్ఫూర్తి పొందింది. చిన్నతనం నుంచి వేదాలను అభ్యసించటం ప్రారంభించింది. ఆమె తన తండ్రితో వివాహ వేడుకలలో సహాయ పూజారిగా పనిచేస్తోంది. బంటవాల్​ తాలూకాలోని దాసకోడి సమీపంలో కాశెకోడి పూజారి సూర్యనారాయణ భట్ ఇంట్లో ప్రతిరోజూ వేద్యాధ్యానం జరుగుతుంది.

"నాకు అర్చకత్వంపై ఆసక్తి ఉంది. ఇంట్లో అందుకు తగ్గ వాతావరణం ఉంది. అందుకే నేను వేదాంతశాస్త్రంలో పాలుపంచుకున్నాను. సంస్కృత భాషలో నేను మరింత నేర్చుకోవాల్సి ఉంది" అని అనఘా అన్నారు.

వేదాధ్యయనంలో అనఘా పాలుపంచుకోవటం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు కల్లాడ్కా ప్రభాకర్ భట్ తెలిపారు. యువతికి ఆశీస్సులు అందించారు.

ఇదీ చదవండి:చెల్లి చదువు కోసం అరక పట్టిన యువతి

12 మామిడి పండ్లకు రూ.1.2లక్షలు- బాలిక కల సాకారం

ABOUT THE AUTHOR

...view details