Young Girl Hangs to Death at Hostel at Hyderabad:పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఓ అభ్యర్థిని హైదరాబాద్‌లో ఆత్మహత్య(Young Girl Committed Suicide) కు పాల్పడటం కలకలం రేపింది. వరంగల్ జిల్లా బిక్కజిపల్లి మండలం పొనకల్‌కు చెందిన మర్రి ప్రవళిక డిగ్రీ పూర్తి చేసింది. పోటీ పరీక్షలకు రాసేందుకు అశోక్‌నగర్ లోని ఓ కోచింగ్ సెంటర్‌లో చేరి శిక్షణ తీసుకుంటోంది. సమీపంలో ఉన్న బృందావన్ మహిళా వసతి గృహంలో అద్దెకు ఉంటోంది. 15 రోజుల క్రితమే ఈ హాస్టల్లో చేరిన ప్రవళిక శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది.
గమనించిన రూమ్ మేట్స్ యజమానులకు సమాచారం అందించారు. అప్పటికే ప్రవళిక మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తుండగా ప్రవళిక మృతికి ప్రభుత్వమే కారణం అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, అభ్యర్థులు.. ఉద్యోగ నియామకాల్లో జాప్యం జరగడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని నినాదాలు చేశారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
వసతి గృహం పైనుంచి పడి ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
Student Suicide in Hostel at Ashok Nagar: అందోళన చేస్తున్న వారికి కాంగ్రెస్, బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు అనిల్‌కుమార్ యాదవ్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఆందోళనకు మద్దతు పలికారు. ఒక దశలో ఆందోళన తీవ్ర ఉద్రిక్తలకు దారి తీయడంతో.. ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. విద్యార్థులు, రాజకీయ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయినప్పటికీ ఆందోళన ఉద్ధృతం కావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి.. ముషీరాబాద్ ఠాణాకు తలించారు. కాంగ్రెస్ నేతలు ఫిరోజ్‌ఖాన్, విజయారెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసుల దోమలగూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.