తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Young Farmer Innovation : నీళ్లు లేకుండానే పంట.. యువరైతు వినూత్న ఆవిష్కరణ.. 20 ఏళ్లకు పేటెంట్​ హక్కులు కూడా..

Young Farmer Innovation : వేసిన పంట చేతికి రావాలంటే దానిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇందులో భాగంగానే పంటకు నిత్యం నీరు అందిస్తుండాలి. మరి సకాలంలో వర్షాలు కురవకపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి సమస్యకే చెక్​ పెట్టే ప్రయత్నం చేశారు మహారాష్ట్రకు చెందిన ఓ యువరైతు. ఇంతకీ అతడు చేసిన ఆ ఆవిష్కరణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Maharashtra Young Farmer Innovation
Maharashtra Young Farmer Success Story

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 8:18 AM IST

Updated : Sep 26, 2023, 10:11 AM IST

నీళ్లు లేకుండానే పంట.. యువరైతు వినూత్న ఆవిష్కరణ

Young Farmer Innovation :వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే రైతులకు తన ఆవిష్కరణతో మార్గం చూపించాడో యువకుడు. మొక్కజొన్నతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే మరో పదార్థంతో ఓ మిశ్రమాన్ని తయారు చేశాడు మహారాష్ట్ర జల్​గావ్​ జిల్లాలోని బ్రాహ్మణ్‌షెవ్‌గే గ్రామానికి చెందిన ప్రకాశ్​ సునీల్​ పవార్​. దీని సాయంతో సుమారు రెండునెలల వరకు నీటి లభ్యత లేకున్నా పంటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చు.

45 నుంచి 60 రోజుల పాటు నీరు లేకపోయినా..
Crops Without Water : లేత ఆకుపచ్చ రంగులో ఉండే.. ఈ పేస్ట్​ను మొక్కల వేర్ల పైభాగంలోని మట్టిలో కలపాలని ప్రకాశ్ చెబుతున్నాడు. ఇలా కలిపిన చోట.. 45 నుంచి 60 రోజుల పాటు నీరు లేకపోయినా పంటలు ఎండిపోకుండా ఉంటాయని వివరిస్తున్నాడు. రైతుల కోసం తాను చేసిన ఈ ఆవిష్కరణ ఉద్దేశం.. భారతీయ సంస్కృతిని రక్షించడానికే అంటున్నాడు ప్రకాశ్​​ పవార్​.

ప్రకాశ్​ సునీల్​ పవార్​, యువరైతు

"నేను చేసిన పరిశోధనతో పంటకు సుమారు రెండు నెలల వరకు నీరు అందించకపోయినా బతుకుతుంది. ఈ ఆవిష్కరణలో నేను విజయం సాధించాను. పైగా 20 ఏళ్ల వరకు నేను పేటెంట్​ హక్కులను కూడా దక్కించుకున్నాను."

- ప్రకాశ్​ సునీల్​ పవార్​, యువరైతు

20 ఏళ్లపాటు పేటెంట్​ హక్కులు
ఈ ఆవిష్కరణపై 20 ఏళ్ల పాటు పేటెంట్​ హక్కులను పొందాడు ప్రకాశ్​. ఇది తనకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రకాశ్​ చేసిన ఈ వినూత్న ఆవిష్కరణ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు గ్రామస్థులు. వ్యవసాయానికి సంబంధించి తమ కుమారుడు చేసిన ఈ కొత్త ప్రయోగం రైతుల ఆత్మహత్యలను తగ్గిస్తుందన్నారు ప్రకాశ్​ పవార్​ తల్లిదండ్రులు. అంతేకాకుండా పంట నష్టాలను నివారిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

"వ్యవసాయానికి సంబంధించి నా కుమారుడు చేసిన ఈ ఆవిష్కరణకు మేము చాలా గర్విస్తున్నాము. ఈ పరిశోధన రైతుల ఆత్మహత్యలను తగ్గించడమే కాకుండా పంట నష్టాలను నివారిస్తుంది. రైతుల కోసం ప్రకాశ్​ పవార్ చేసిన ఈ ప్రయత్నం మరిన్ని సత్ఫలితాలను సాధిస్తుందని ఆశిస్తున్నాము."

- ప్రకాశ్​ సునీల్​ పవార్ తల్లిదండ్రులు

Last Updated : Sep 26, 2023, 10:11 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details