Couple charred to death: కారులో మంటలు చెలరేగి నవ దంపతులు సజీవ దహనమైన విషాద ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మంటల్లో కాలిపోతున్న కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. మృతులు బెంగళూరులోని ఆర్టీ నగర్‌కు చెందిన దంపతులు యశ్వంత్(23), జ్యోతి(23)లుగా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం..బెంగళూరు ఆర్టీ నగర్‌కు చెందిన దంపతులు మే 18న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇంటర్వ్యూకి హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు జ్యోతి తన కుటుంబ సభ్యులతో తెలిపింది. మరోవైపు.. తరగతులకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు యశ్వంత్ చెప్పారు. ఇంటికి తిరిగి రాలేదు. దీంతో హెబ్బల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు కుటుంబ సభ్యులు.