షూ లేస్ మెడకు బిగుసుకుని ఊపిరాడక ఓ పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని మల్లప్పురం జిల్లాలో జరిగిందీ ఘటన.
ఉరితాడుగా మారిన షూలేస్- ఆడుకుంటూ బాలుడు మృతి - కేరళలో షూలేస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన పదేళ్ల బాలుడు
కేరళలోని మలప్పురంలో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. షూలేస్ మెడకు బిగుసుకుని పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
షూలేస్ ఇరుక్కుని బాలుడు మృతి
మల్లప్పురం జిల్లా పూకోట్టుంపాదం గ్రామంలో నివసిస్తున్న ఫైజల్ నజీర్-ఓపీ మునీరా కుమారుడైన మహమ్మద్ రఫిక్ (10) గురువారం ఆడుకుంటున్న సమయంలో.. అనుకోకుండా మెడకు షూ లేస్ బిగుసుకుంది. దీనితో రఫిక్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన తల్లిదండ్రులు ఆ బాలుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీనితో రఫిక్ కుటుంబ సభ్యుల్లో విషాదం అలముకుంది.