తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'న్యాయవ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్ అవసరం' - sc cji reservations

న్యాయవ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్ అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

CJI
జస్టిస్ ఎన్వీ రమణ

By

Published : Sep 26, 2021, 8:46 PM IST

దేశ న్యాయవ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. న్యాయ కళాశాలల్లోనూ ఇదే తరహా రిజర్వేషన్‌ అవసరమని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి సహా నూతనంగా నియమితులైన తొమ్మిది మంది జడ్జిలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా.. మహిళా న్యాయమూర్తులను ఉద్దేశించి జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడారు. 'రిజర్వేషన్‌ మీ హక్కు.. దాన్ని డిమాండ్‌ చేయడానికి మీరు అర్హులు' అని వెల్లడించారు.

జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ..'దిగువ కోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు 30శాతం కంటే తక్కువే. హైకోర్టుల్లో అది 11.5 శాతం. సుప్రీంకోర్టులో 11-12 శాతం మాత్రం మాత్రమే ఉన్నారు. న్యాయవ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అవసరం. ఇది వేల సంవత్సరాల అణచివేతకు సంబంధించిన సమస్య' అని అన్నారు. 'దేశంలోని 1.7 మిలియన్ల న్యాయవాదులు ఉండగా.. అందులో 15శాతమే మహిళలు. రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో ఎన్నికయ్యే మహిళా ప్రజాప్రతినిధులు 2శాతమే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిటీలో ఒక్క మహిళా ప్రతినిధి కూడా ఎందుకు లేరని నేను ప్రశ్నిస్తున్నా' అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలని ఆశించారు.

మహిళా న్యాయవాదులు ఎదుర్కొనే సమస్యలపైనా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడారు. అసౌకర్యమైన పని వాతావరణం. మహిళా వాష్‌రూమ్‌లు, బేబీ కేర్‌ సెంటర్ల గురించి చర్చించారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం కుమార్తెల దినోత్సవం సందర్భంగా మహిళకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details