Yogi Adityanath Twitter Followers Count :ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్ X(ట్విట్టర్)లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఉన్న ఫాలోవర్స్ సంఖ్య బుధవారం 26 మిలియన్ (2.6 కోట్లు) దాటింది. లఖ్‌నవూలోని యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ఓ ప్రకటన ద్వారా తెలిపింది. సీఎంఓ ప్రకారం.. దేశంలో అత్యధిక మంది ట్విట్టర్ ఫాలోవర్లు కలిగిన మూడో రాజకీయ నేతగా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. మొదటి రెండు స్థానాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, అనేక దేశాల అధినేతలతో పోల్చితే.. ట్విట్టర్లో యోగికి ఉన్న ప్రజాదరణ ఎక్కువని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
యూపీ సీఎంఓ ప్రకటనలోని మరికొన్ని ముఖ్యాంశాలు..
- వెనుకబడిన, శాంతిభద్రతలు సరిగా లేని రాష్ట్రంగా ముద్రపడిన ఉత్తర్ ప్రదేశ్ పట్ల ప్రజల దృక్పథాన్ని మార్చిన ఘనత యోగి ఆదిత్యనాథ్‌దే.
- అన్ని రంగాల్లో అభివృద్ధి, సామాన్య ప్రజల్ని సాధికారుల్ని చేయడం ద్వారా యోగి ఆదిత్యనాథ్‌కు ఉన్న జనాదరణ ఎల్లలు దాటుతోంది.
- 30 రోజుల్లో అత్యధిక మంది ఫాలోవర్లను సంపాదించుకున్న వ్యక్తులు, సంస్థల జాబితాను X ఇటీవల విడుదల చేసింది. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తర్వాత రెండో స్థానంలో యోగి నిలిచారు. నెల రోజుల వ్యవధిలో యోగి ఫాలోవర్స్ సంఖ్య 2లక్షల 67 వేల 419 మేర పెరిగింది.
మోదీ, షా ఫాలోవర్స్ ఎంత మంది?
Modi Amit Shah Twitter Followers Count :ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ X(ట్విట్టర్)లో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నేతగా ఉన్నారు. మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 91.5 మిలియన్లు(9 కోట్ల 15 లక్షలు). ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారిక ట్విట్టర్ ఖాతాను 54 మిలియన్ల (5.4 కోట్ల) మంది ఫాలో చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతాకు 33.7 మిలియన్ (3.37 కోట్ల మంది) ఫాలోవర్స్ ఉన్నారు.
పేరు | ట్విట్టర్ ఫాలోవర్స్ |
నరేంద్ర మోదీ | 91.5 మిలియన్ |
అమిత్ షా | 33.7 మిలియన్ |
యోగి ఆదిత్యనాథ్ |