తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోరఖ్​పుర్​లో 'యోగి' నామినేషన్​.. అమిత్​ షా పొగడ్తలు - యోగి నామినేషన్​

CM Yogi Adityanath nomination: ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. గోరఖ్​పుర్​లో ఆయన శుక్రవారం.. నామినేషన్​ దాఖలు చేశారు. ఆయన వెంట కేంద్ర హోం మంత్రి అమిత్​ షా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా.. యోగిపై పొగడ్తల వర్షం కురిపించారు షా.

Yogi Adityanath to filed nomination papers from Gorakhpur
Yogi Adityanath to filed nomination papers from Gorakhpur

By

Published : Feb 4, 2022, 12:57 PM IST

Updated : Feb 4, 2022, 5:40 PM IST

గోరఖ్​పుర్​లో యోగి నామినేషన్​

CM Yogi Adityanath nomination: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలోనే గోరఖ్​పుర్​ అర్బన్​ స్థానం నుంచి శుక్రవారం.. నామినేషన్​ దాఖలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. ఆయన వెంట కేంద్ర హోం మంత్రి అమిత్​ షా కూడా ఉన్నారు.

కలెక్టరేట్​ కార్యాలయంలో నామినేషన్​ సమర్పిస్తున్న యోగి ఆదిత్యనాథ్​, పక్కనే అమిత్​ షా
అమిత్​ షా కు స్వాగతం పలుకుతున్న యోగి

అంతకుముందు యోగి.. గోరఖ్​నాథ్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చి నామినేషన్​ సమర్పించారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న యూపీ సీఎం
గోరఖ్​నాథ్​ ఆలయంలో యోగి ఆదిత్యనాథ్​ పూజలు

యోగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు గోరఖ్​పుర్​ నుంచే ఐదు సార్లు లోక్​సభకు ప్రాతినిథ్యం వహించారు యోగి.

యోగి, అమిత్​ షా ఎన్నికల ప్రచారం

నామినేషన్​ వేయడానికి ముందు.. అమిత్​ షాతో కలిసి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు సీఎం. ఈ సందర్భంగా.. ఐదేళ్ల కాలంలో భాజపా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు యోగి ఆదిత్యనాథ్​. డబుల్​- ఇంజిన్​ సర్కార్​పై ఏ ఒక్కరూ వేలెత్తిచూపలేరని అన్నారు.

భాజపా ఎన్నికల ప్రచారం
యోగి ఆదిత్యనాథ్​

''గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింట మూడొంతుల మెజారిటీ సాధించాం. 2019 సాధారణ ఎన్నికల్లో మహాఘట్​బంధన్​ను చిత్తుగా ఓడించాం. భాజపా ఆర్టికల్​ 370ని రద్దు చేసింది. రామమందిర నిర్మాణాన్ని సాకారం చేస్తోంది.''

- యోగి ఆదిత్యనాథ్​, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి

ఈ సందర్భంగా యూపీ సీఎంను.. అమిత్‌ షా పొగడ్తల్లో ముంచెత్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌ను మాఫియా నుంచి విముక్తి చేసిన ఘనత యోగిదే అన్నారు. 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సరైన పాలనను తిరిగి అందించారని ప్రశంసించారు.

యోగి, అమిత్​ షా విజయసంకేతం

''2014, 2019 సార్వత్రిక, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే.. రానున్న ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో భాజపా మరోసారి విజయం సాధిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీతో విజయం కట్టబెడుతారు.

యోగి ఆదిత్యనాథ్​ కొవిడ్‌ మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేశారు. భారీ ఎత్తున వ్యాక్సిన్‌ పంపిణీ చేసిన రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్‌ను నిలిపారు. కొవిడ్‌పై అత్యంత సమర్థంగా పోరాడారు.''

- అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి మొత్తం 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. అప్నాదళ్​, నిషాద్​ పార్టీలతో కలిసి భాజపా కూటమిగా పోటీ చేస్తోంది.

మార్చి 3న ఆరో దశలో భాగంగా.. గోరఖ్​పుర్​ అర్బన్​లో ఎన్నికలు జరగనున్నాయి.

2017 ఎన్నికల్లో భాజపా ఏకంగా 312 స్థానాల్లో గెలుపొంది.. పూర్తి మెజారిటీ సాధించింది. మొత్తం 403 స్థానాలుండగా.. 39.67 ఓట్ల శాతాన్ని సొంతం చేసుకుంది. సమాజ్​వాదీ పార్టీ 47 చోట్ల నెగ్గింది. బీఎస్పీ 19 చోట్ల విజయం సాధించగా.. కాంగ్రెస్​ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది.

ఇదీ చూడండి:ఎన్నికల ముందు సీఎం చన్నీకి ఈడీ షాక్​.. మేనల్లుడి అరెస్ట్​

Last Updated : Feb 4, 2022, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details