ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి పాగా వేసేందుకు యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్టే యువతను ఆకట్టుకునేందుకు ఉచితాల జల్లును కురింపించింది. డిజిటల్ సాధికారత పేరిట.. కోటిమంది యువతకు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. అసెంబ్లీలో బుధవారం అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు. ఈ పథకం కోసం సుమారు రూ.3వేల కోట్లు వెచ్చించనున్నారు.
గరిష్ఠంగా మూడు పరీక్షల కోసం ఈ భత్యాన్ని అందజేయనున్నట్లు వివరించారు.
''ఈ పథకం కింద కోటి మంది విద్యార్థుల్ని ఎంపిక చేస్తాం. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, టెక్నికల్, డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ అందించనున్నాం. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సన్నాహక భత్యం ఇచ్చి సహకరిస్తాం.''