కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, అతని కుమారుడు బీవై విజయేంద్రపై భాజపా రెబల్ రెబల్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి, కొడుకులు కలిసి వీరశైవ-లింగాయత్ సంఘాన్ని విడదీసేందుకు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. తుముకూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పదవికి ముప్పు వచ్చినప్పుడే ముఖ్యమంత్రికి వీరశైవ-లింగాయత్ ప్రజలు గుర్తొస్తారని ఆరోపించారు. స్వయంగా లింగాయత్ అయిన యడియూరప్పకు... లింగాయత్ కమ్యూనిటీకి ఓబీసీ(2ఏ) గుర్తింపు రాకూడదనే దురుద్దేశం ఉందని విమర్శించారు.
'వీరశైవ లింగాయత్ సంఘాన్ని విడదీసేందుకు సీఎం కుట్ర' - Lingayat communit
వీరశైవ-లింగాయత్ సంఘాన్ని విడదీసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, అతని కుమారుడు బీవై విజయేంద్ర కుట్రపన్నుతున్నారని భాజపా రెబల్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తీవ్ర విమర్శలు చేశారు. స్వయంగా లింగాయత్ అయిన యడియూరప్ప... లింగాయత్‌ల ఓబీసీ(2ఏ)స్టేటస్ గురించి పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.

'వీరశైవ-లింగాయత్ సంఘాన్ని విడదీసేందుకు సీఎం కుట్ర'
రాష్ట్రంలోని వీరశైవ-లింగాయత్ కమ్యూనిటీకి ఓబీసీ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బసవ జయ మృత్యుంజయ స్వామి( కుదలసంఘమ మఠం) చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. యడియూరప్ప త్వరలో పదవి నుంచి దిగిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన కర్ణాటక మంత్రివర్గ విస్తరణలో సీనియర్ నాయకుడైన తనకు చోటు కల్పించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :ట్రక్కు బోల్తా.. 16 మంది కూలీలు మృతి
Last Updated : Oct 10, 2022, 3:33 PM IST