కర్ణాటక సీఎం యడియూరప్పపై ఆ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు అసెంబ్లీల ఎన్నికలు పూర్తవగానే ముఖ్యమంత్రిగా ఆయన్ను తొలగిస్తారని ఎమ్మెల్యే పాటిల్ యత్నాల్ జోస్యం చెప్పారు.
అధిష్ఠానానికి యుడియూరప్పపై నమ్మకం పోయిందన్నారు పాటిల్. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రజల ముందుకు పార్టీ వెళ్లలేని పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు. ఈ కారణం చేతనే సీఎం మార్పు తథ్యం అని అన్నారు.
"ఇప్పటికే పార్టీ అధినాయకత్వం ఉత్తరాఖండ్లో ముఖ్యమంత్రిని మార్చింది. ఇప్పుడు హరియాణా, కర్ణాటక వంతు. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే నాయకత్వం మార్పు ఉంటుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి పార్టీ పెద్దలకు తెలుసు."