పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ - Vamsi Krishna Srinivas
Published : Dec 27, 2023, 3:09 PM IST
|Updated : Dec 27, 2023, 4:14 PM IST
14:50 December 27
వచ్చే ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి కీలకం: పవన్
YCP MLC Vamsi Krishna Srinivas joined Janasena:విశాఖ జిల్లా వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. వంశీకృష్ణకు కండువా కప్పి పవన్ కల్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి చాలా కీలకమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.
వంశీకృష్ణ గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారని, అప్పటి నుంచి ఆయన తనకు తెలుసని తెలిపారు. తనను నమ్మి పార్టీలోకి వచ్చిన వారిని గుర్తు పెట్టుకుంటానని వెల్లడించారు. 2014లో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ వెంట నడిచిన ప్రతిఒక్కరూ నేడు, జనసేన వైపునకు రావడం ఆనందంగా ఉందని పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ యాదవ్‌తో పాటుగా ఆయన అనుచరులు సైతం జనసేనలో చేరారు.