YCP MLC Jayamangala Venkata Ramana third marriage:ఆయన వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ.. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి జరిగింది. తాజాగా.. ముచ్చటగా మూడోసారి పెళ్లికొడుకుగా మారాడు. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ఎమ్మెల్సీ మూడో సారి మరో వివాహం చేసుకున్నారు. మెుదటి భార్యకు ఒక కుమార్తె ఉండగా... రెండో భార్యకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఆ ఎమ్మెల్సీ మూడో పెళ్లి - రెండో భార్య సాక్షి సంతకం - మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ
YCP MLC Jayamangala Venkata Ramana third marriage: వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ నిరాడంబరంగా మూడో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఆయన రెండో భార్య పెళ్లి పెద్దగా నిలిచి సాక్షి సంతకం చేశారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న సుజాతతో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ.. కైకలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ వివాహము చేసుకున్నారు. ఈ వివాహన్ని ఎమ్మెల్సీ జయమంగళ రెండో భార్య సునీత దగ్గరుండి జరిపించారు.

Published : Nov 27, 2023, 4:01 PM IST
|Updated : Nov 27, 2023, 4:24 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ నిరాడంబరంగా మూడో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఆయన రెండో భార్య పెళ్లి పెద్దగా నిలిచి సాక్షి సంతకం చేశారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న సుజాతతో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ.. కైకలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ వివాహము చేసుకున్నారు. ఈ వివాహన్ని ఎమ్మెల్సీ జయమంగళ రెండో భార్య సునీత దగ్గరుండి జరిపించారు. ఎమ్మెల్సీ కుమారుడు సైతం ఈ పెళ్లి తంతులో పాల్గొన్నారు. ఈ వివాహానికి మాజీ భార్య సునీత సాక్షి సంతకం చేయడం చేశారు.
ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు . తరువాత రెండో భార్య సునీతను వివాహం చేసుకోగా ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం అటవీ శాఖ లో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న సుజాతను ఎమ్మెల్సీ జయమంగళ ముచ్చటగా మూడవ వివాహం చేసుకోవడం విశేషం. వివాహ దృవీకరణ పత్రాన్ని.. కైకలూరు సబ్ రిజిస్టర్ జయమంగళ దంపతులకు అందజేశారు.