మహారాష్ట్ర యవత్మాల్లోని రాలెగావ్కు చెందిన ప్రణిక, తన వివాహ వేడుకకు ట్రాక్టర్ నడుపుతూ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా తాను ట్రాక్టర్‌పై వచ్చినట్లు తెలిపింది. తాను రైతు కుమార్తెను అని చెప్పిన ఆమె.. ప్రపంచానికి భోజనం పెడుతున్న అన్నదాతలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
రైతులకు మద్దతుగా ట్రాక్టర్ నడిపిన వధువు - కొత్త సాగు చట్టాలు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమానికి ప్రజలు వారికి తోచిన విధంగా మద్దతు తెలుపుతున్నారు. మహారాష్ట్ర యవత్మాల్కు చెందిన ఓ వధువు ట్రాక్టర్ నడుపుత పెళ్లి మండపానికి వచ్చి అందరిని అబ్బుర పరిచింది. రైతులకు మద్దతుగా తాను ఈ విధంగా చేసినట్లు పేర్కొంది.
రైతులకు మద్దతుగా పెళ్లికి ట్రాక్టర్ పై వచ్చిన వధువు
ప్రణిక యవత్మాల్కు చెందిన పండరినాథ్, దుర్గా దంపతుల కుమార్తె. వారిది వ్యవసాయ కుటుంబం. అదే ప్రాంతంలో ఉండే చంద్రపూర్‌కు చెందిన నిఖిష్ని వివాహం చేసుకుంది.