తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆన్​లైన్​లోనే యమునోత్రి దర్శనం - కేదార్​నాథ్​ ఆలయం

అక్షయ తృతీయను పురస్కరించుకుని చార్​ధామ్​ ఆలయాల్లో ఒకటైన యమునోత్రి ఆలయం తెరచుకుంది. అయితే కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది సైతం ఆన్​లైన్​ పోర్టల్ ద్వారానే భక్తులకు పూజలు అందించనున్నారు. అలాగే మిగతా మూడు ఆలయాలు గంగోత్రి శనివారం(మే 15న), కేదార్‌నాథ్ మే 17న, బద్రీనాథ్ ఆలయం మే 18న తెరుచుకోనున్నాయి.

yamunotri-dham-doors-opened
తెరచుకున్న యమునోత్రి ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ

By

Published : May 14, 2021, 8:30 PM IST

హిందువులు పవిత్రంగా భావించే 'చార్​ధామ్'​ ఆలయాలు అక్షయ తృతీయ సందర్భంగా తెరుచుకున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్​లోని యమునోత్రి ఆలయం ఆన్​లైన్​ పోర్టల్​ శుక్రవారం ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది పూజారులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భక్తులకు ప్రవేశాన్ని నిరాకరించారు.

అక్షయ తృతీయ సందర్భంగా మధ్యాహ్నం 12.15 గంటలకు పూజారులు, అధికారులతో సహా.. 25 మంది సమక్షంలో ఈ ఆలయ ద్వారాలు తెరిచినట్లు యమునోత్రి ఆలయ తీర్థ్ పురోహిత్ పవన్ ఉనియల్ తెలిపారు. మొదటి పూజను ప్రధాని నరేంద్ర మోదీ తరఫున నిర్వహించారు పూజారులు.

అతి తక్కువ మందితో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు
ఆలయం వెలుపల భక్తులు లేక ఇలా..

శీతాకాలంలో ఆరునెలల పాటు మూసి ఉండే చార్​ధామ్ ఆలయాలు భక్తుల సందర్శనార్థం వేసవికాలంలో తెరుచుకుంటాయి. అయితే కరోనా కారణంగా గతేడాది నుంచి ఆన్​లైన్​ పోర్టల్స్​ ద్వారా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పూజారులకు స్క్రీనింగ్ టెస్ట్
యమునోత్రి ఆలయం లోపలి దృశ్యాలు

ఇక చార్​ధామ్ దేవాలయాల్లో భాగమైన ​గంగోత్రి పోర్టల్​ మే 15(శనివారం) ఉదయం 7 గంటల 31 నిమిషాలకు ప్రారంభం కానుండగా.. కేదార్​నాథ్​ మే 17న, బద్రీనాథ్ ఆలయం మే 18న తెరుచుకోనున్నాయి.

ఇవీ చదవండి:నేటి నుంచే చార్​ధామ్ యాత్ర.. భక్తులకు నో ఎంట్రీ

ABOUT THE AUTHOR

...view details