భారీ వర్షాల కారణంగా దిల్లీలోని యమునా నది ఉప్పొంగుతోంది. నదిలో నీటిమట్టం గరిష్ఠస్థాయి 205.33 మీటర్లను దాటేసిందని దిల్లీ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. గంటగంటకూ నీటిమట్టం పెరుగుతోందన్నారు. దీంతో అన్నిశాఖలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు.
హరియాణా ప్రభుత్వం కూడా హత్నీకుంద్ బ్యారేజీ ద్వారా నదిలోకి నీటిని విడుదల చేయటం ద్వారా నీరు ఉద్ధృతి పెరిగిందని వివరించారు.