తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శనిదోషం ఎన్ని పూజలు చేసినా పోవట్లేదా? - ఇలా పూజిస్తే తొలగిపోతుంది! - Shani Dev Puja

Shani Dev Worship Flowers : మీరు శని దోషంతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని పూజలు చేసినా ఆ దోషం పోవట్లేదా? అయితే.. శాస్త్రప్రకారం ఈ పుష్పాలతో శనివారం శనిదేవున్ని పూజిస్తే.. దోషం పూర్తిగా తొలగిపోవడమే కాకుండా.. కష్టాలన్నీ తొలగి సిరి సంపదలు కలుగుతాయంటున్నారు పండితులు..!

Shani Dev Worship Flowers
Shani Dev Worship Flowers

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 11:58 AM IST

Worship Shani Dev with These Flowers :హిందూ పురాణాల్లోని శని పేరు చెప్పగానే.. చాలా మందికి భక్తి కంటే భయమే ఎక్కువగా కలుగుతుంది. ఆయన బారినుంచి కాపాడాలని ఇతర దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. కొందరు శనిపూజ కూడా చేయిస్తారు. అయినప్పటికీ.. కొందరి సమస్యలు అలాగే ఉంటాయి. అయితే.. శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తే.. తప్పకుండా దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు!

హిందూ మతంలో.. ఒక్కో దేవతకు ఒక్కో ఇష్టమైన రోజు ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదేవిధంగా.. శనీశ్వరునికి కూడా శనివారం(Saturday) అత్యంత ప్రీతికరమైన రోజు. కాబట్టి.. జాతకంలో శని దోషం ఉన్నవారు శనివారం రోజున ఆయనను సేవించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అయితే.. ఏదో మొక్కుబడిగా కొబ్బరికాయ కొట్టి ఓ దండం పెట్టుకోకుండా.. ప్రత్యేక పూలతో నిష్ఠగా పూజ చేయాలని సూచిస్తున్నారు.

శాస్త్రం ప్రకారం 4 రకాల పూలతో శని దేవుని పూజిస్తే.. ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు చెబుతున్నారు. తద్వారా.. శనిదేవుని ప్రసన్నం పొంది కష్టనష్టాలు తొలగించుకోవచ్చని అంటున్నారు. మరి.. ఇంతకీ ఆ పూలు ఏంటో చూద్దాం.

అపరాజిత పుష్పం : మీరు శని దేవుని అనుగ్రహం పొంది మీ కష్టాలు తొలగిపోవాలంటే.. అపరాజిత పుష్పాన్ని స్వామికి సమర్పించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం.. శని దేవుడికి అపరాజిత పుష్పం అంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు శనివారం ఉదయం పూజ చేసేటప్పుడు.. 5 లేదా 7 లేదా 11 అపరాజిత పుష్పాలను సమర్పించాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం అతడు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దాంతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.

జిల్లేడు పూలతో పూజ :శనివారం నాడు శనిదేవునికి జిల్లేడు పుష్పాలను సమర్పించడం చాలా శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా పూజించడం ద్వారా సంవత్సరాలుగా మీపై ఉన్న శనిదోషం ప్రభావం తొలగి.. శుభ ఫలితాలను పొందుతారని అంటున్నారు.

శమీ పుష్పం : శనిదేవుని దీవెనలు పొంది మీ జీవితంలోని అన్ని సమస్యలూ, వ్యాధుల నుంచీ ఉపశమనం పొందేందుకు.. మీరు శమీ పుష్పాలను సమర్పించాలని సూచిస్తున్నారు. మీ జీవితంలో శుభ ఫలితాల కోసం.. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత శనిదేవున్ని.. శమీ పుష్పాలతో పూజించాలని చెబుతున్నారు. తద్వారా.. ఎన్నో ఉత్తమ ఫలితాలు పొందుతారని అంటున్నారు.

మందార పూలతో ఆరాధన : మందార పువ్వులు దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. అయితే.. వీటిని శనిదేవునికి కూడా సమర్పించాలని చెబుతున్నారు. ఈ శనివారం రోజున ఈ పుష్పాలతో శనీశ్వరుని పూజించారంటే.. శని దోషం నుంచి పూర్తిగా విముక్తి పొందుతారట. ఆ తర్వాత శనిదేవుడి ఆశీర్వాదంతో జీవితంలో మంచి రోజులు మొదలవుతాయని అంటున్నారు. ఇలా ఈ నాలుగు పుష్పాలతో శనిదేవుడి పూజించి.. మీ సమస్యలు తొలగించుకోవచ్చని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని సరైన దిశలోనే ఉంచారా? - లేదంటే ఎన్ని పూజలు చేసిన శూన్యం!

మీ పూజగదిలో ఈ మార్పులు చేయండి - ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details