తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్​ పిల్లర్​​​.. ఎక్కడంటే? - ప్రపంచంలోనే ఎత్తైన స్తంభపు వంతెన న్యూస్

world's tallest pier bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను పిల్లర్లతో మణిపుర్​లో నిర్మిస్తోంది భారతీయ రైల్వే. 141 మీటర్ల ఎత్తున్న పిల్లర్​ నిర్మించటం ద్వారా రికార్డ్​ సృష్టించనుంది. 2023, డిసెంబర్​ నాటికి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

world's tallest pier bridge
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే

By

Published : Nov 28, 2021, 9:06 AM IST

Updated : Nov 28, 2021, 10:46 AM IST

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్​ పిల్లర్

world's tallest pier bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్తంభపు వంతెనను రైల్వే శాఖ నిర్మిస్తోంది. మణిపుర్​లో జిరిబామ్‌-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 141 మీటర్ల ఎత్తైన స్తంభం నిర్మిస్తుండగా.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్​ పిల్లర్​గా నిలవనుందని రైల్వేశాఖ తెలిపింది.

ప్రపంచంలోనే ఎత్తైన స్తంభపు వంతెన
స్తంభపు వంతెన నిర్మాణం

111 కిలోమీటర్ల పొడవుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే జిరిబామ్‌-ఇంఫాల్ మధ్య ప్రయాణ సమయం గతం కన్నా 2-2:30గంటలు తగ్గనుందని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ సందీప్ శర్మ తెలిపారు. ప్రస్తుతం జిరిబామ్‌-ఇంఫాల్ మధ్య దూరం 220 కిలోమీటర్లు ఉందని. సాధారణంగా ప్రయాణానికి 10-12 గంటల సమయం పట్టేదన్నారు.

ప్రపంచంలోనే ఎత్తైన స్తంభపు వంతెన
నిర్మాణంలో స్తంభపు వంతెన

మొదటి దశలో 12 కిలోమీటర్లు బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, రెండో దశ పనులు 2022, ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయన్నారు. 2008లో 13,800 కోట్లతో మంజూరైన ఈ ప్రాజెక్టు.. 2023, డిసెంబర్ నాటికి రైల్వే వంతెన పూర్తిగా ప్రయాణానికి అందుబాటులోకి వస్తుందన్నారు.

హిమాలయ కొండల్లో రైల్వేశాఖ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 47 సొరంగాలు, 156 వంతెనలు ఉండగా.. కరోనా కారణంగా పనులు కొంత ఆలస్యమైనట్లు తెలిపారు.

ఇదీ చూడండి:'ఒమిక్రాన్'పై ముందస్తు జాగ్రత్తలు- రాష్ట్రాలు సన్నద్ధం

Last Updated : Nov 28, 2021, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details