ప్రపంచంలోనే ఎత్తైన నటరాజ పంచలోహ విగ్రహాన్ని తెలంగాణ గవర్నర్, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. తమిళనాడు కుంభకోణంలోని లక్ష్మీ నారాయణి పీఠం ట్రస్టీలకు విగ్రహాన్ని లాంఛనంగా అందజేశారు. 23 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో నటరాజ విగ్రహాన్ని రూపొందించారు. ఒకేసారి పోతపోసి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విధంగా రూపొందించిన నటరాజ విగ్రహాల్లో ఇదే అత్యంత ఎత్తైనది కావడం విశేషం.
ప్రపంచంలోనే ఎత్తైన నటరాజ విగ్రహం.. ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై - nataraja statue tamil nadu
ప్రపంచంలోనే ఎత్తైన నటరాజ పంచలోహ విగ్రహాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. ఒకేసారి పోతపోసి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విధంగా రూపొందించిన నటరాజ విగ్రహాల్లో ఇదే అత్యంత ఎత్తైనది కావడం విశేషం.

15 టన్నుల బరువైన ఈ విగ్రహాన్ని.. కుంభకోణంలోని తిమ్మాకుడి గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి వరదరాజ్ తయారు చేశారు. విగ్రహం చుట్టూ 102 పద్మాలు, 52 సింహాలు, 34 సర్పాలను తీర్చిదిద్దారు. సాధారణంగా భారీ విగ్రహాలను.. విడి భాగాలుగా తయారు చేసి తర్వాత కలిపేస్తారు. అయితే, తాజా నటరాజ విగ్రహాన్ని మాత్రం ఒకేసారి పోతపోసి తయారు చేశారు.
విగ్రహ ఆవిష్కార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ప్రదోష పూజ నిర్వహించారు. తమిళ సంప్రదాయం ఉట్టిపడేలా శివనందియార్లు యాగాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళిసై.. నటరాజ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహానికి పాలు, పుష్పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ విగ్రహాన్ని తయారు చేసిన వరదరాజ్, ఆయన బృందాన్ని అభినందించారు.