తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Worlds Tallest Nataraja Statue Delhi : 19 టన్నులు.. 8 లోహాలు.. భారీ నటరాజ విగ్రహం.. దిల్లీకి పయనం - ప్రపంచంలోనే ఎత్తైన నటరాజ విగ్రహం న్యూస్

Worlds Tallest Nataraja Statue Delhi G20 Meeting : జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనున్న దిల్లీ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా నగరంలో అతిపెద్ద నటరాజస్వామి లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం భారీ విగ్రహాన్ని తమిళనాడు నుంచి దిల్లీకి తరలిస్తున్నారు.

Worlds Tallest Nataraja Statue Delhi
Worlds Tallest Nataraja Statue Delhi

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 8:00 AM IST

Updated : Aug 31, 2023, 8:41 AM IST

Worlds Tallest Nataraja Statue Delhi G20 Meeting :ప్రపంచంలోనే ఎత్తైనదిగా భావిస్తున్న నటరాజస్వామి అష్టధాతు (ఎనిమిది లోహాలు) విగ్రహం దేశ రాజధాని దిల్లీలో కొలువుదీరనుంది. జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగే భవనం ప్రాంగణంలో ఈ 28 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. తమిళనాడులో తయారైన ఈ విగ్రహం దిల్లీకి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ విగ్రహాన్ని బంగారం, వెండి, సీసం, రాగి, తగరం, పాదరసం, ఇనుము, జింక్ లోహాలతో తయారు చేశారు. 19 టన్నుల బరువుతో ఉన్న ఈ విగ్రహం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Nataraja Ashtadhatu Statue Delhi :తమిళనాడు తంజావూరు జిల్లాలోని స్వామిమలై ప్రాంతంలో ఈ విగ్రహం తయారైంది. ప్రముఖ శిల్పి దేవసేనాపతి స్థపతి కుమారులు ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. పరమశివుడు నాట్యం చేస్తున్నట్లుగా ఉన్న భంగిమలో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. కేంద్ర సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. ఫిబ్రవరి 20న విగ్రహ పనులు ప్రారంభం కాగా.. దీన్ని పూర్తి చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది. వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విగ్రహ నిర్మాణ పనులు కాస్త ఆలస్యమయ్యాయి. ఈ విగ్రహం తయారు చేయడానికి రూ.10 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. నటరాజ లోహ విగ్రహాల్లో ప్రపంచంలోనే ఎత్తైనది ఇదేనని చెబుతున్నారు.

నటరాజ విగ్రహం

Tallest Nataraja Statue India :నిర్మాణం పూర్తైన తర్వాత ఈ విగ్రహం బాధ్యతలను ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ప్రొఫెసర్ అచల్ పాండ్యకు అప్పగించారు. విగ్రహాన్ని దిల్లీకి జాగ్రత్తగా చేర్చేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. స్వామిమలై ప్రాంతం నుంచి బయల్దేరిన ఈ విగ్రహం తమిళనాడులోని ఉలుందుర్​పేట్, సేలం, కృష్ణగిరి, హోసూర్ ప్రాంతాల మీదుగా ప్రయాణించనుంది. ఆ తర్వాత కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఆ రాష్ట్రంలోని హోసకోటె, దేవనహళ్లి మీదుగా వెళ్లి.. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​లో అడుగుపెడుతుంది. ఆ తర్వాత తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఆదిలాబాద్ మీదుగా రాష్ట్రం దాటనుంది. నాగ్​పుర్, సియోనీ, సాగర్, లలిత్​పుర్, గ్వాలియర్, ఆగ్రాల గుండా వెళ్లి దిల్లీకి చేరుకుంటుంది.
అబ్బురపరిచే శిల్పకళలకు తంజావూరు జిల్లా పెట్టింది పేరు. గతంలోనూ ఇక్కడ అనేక అద్భుతమైన శిల్పాలు ప్రాణం పోసుకున్నాయి. లోహ విగ్రహాలు చోళుల కాలం నుంచి ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి.

విగ్రహాన్ని తరలిస్తూ..
Last Updated : Aug 31, 2023, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details