తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచంలోనే అరుదైన పొట్టి గుర్రం.. కుక్క కన్నా చిన్నగా.. ఎత్తు రెండు అడుగులే! - మార్వార్ హార్స్​ షోలో పొట్టి గుర్రం న్యూస్

ప్రపంచంలోనే అరుదైన పొట్టి గుర్రాన్ని రాజస్థాన్ జోధ్​పుర్​లో జరిగిన మార్వార్ హార్స్​ షోలో ప్రదర్శించారు. దాని ఎత్తు కేవలం రెండు నుంచి మూడు అడుగులు మాత్రమే ఉంటుంది. ఈ ఫెయర్​లో పొట్టి గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి ఆ గుర్రం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి..

smallest horse falabella in rajasthan Horse Show
ప్రపంచంలోనే పొట్టి గుర్రం

By

Published : Feb 18, 2023, 10:21 AM IST

రాజస్థాన్​ జోధ్​పుర్​లో శుక్రవారం జరిగిన మార్వార్ హార్స్​ షోలో ప్రపంచంలోనే అరుదైన పొట్టి గుర్రాన్ని ప్రదర్శించారు. దీని ఎత్తు రెండు నుంచి మూడు అడుగులు మాత్రమే ఉంటుంది. ఫలాబెల్లా జాతికి చెందిన ఈ పొట్టి గుర్రాన్ని హార్స్​ షోలో ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఈ పోటీల్లో అరేబియా గుర్రాలు పాల్గొన్నా.. ఫలాబెల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు రోజుల పాటు జరిగే ఎనిమిదో ఆల్​ ఇండియా మార్వార్​ హార్స్​ షోకు ఆ జాతికి చెందిన 150 గుర్రాలను తీసుకుని వచ్చారు. ఈ హార్స్​ షోకు కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా అతిథిగా హాజరై.. షో నిర్వాహకులను ప్రశంసించారు.

ఈ అరుదైన జాతికి చెందిన గుర్రాలు కొన్ని కుక్కల కంటే తక్కువ ఎత్తులో ఉంటాయి. సాధారణ గుర్రాల కంటే ఈ అరుదైన జాతికి చెందిన పొట్టి గుర్రాలు ఎక్కవకాలం జీవిస్తాయి. ఈ పొట్టి గుర్రాల సగటు జీవితకాలం 45 సంవత్సరాలు. ఫలాబెల్లా అర్జెంటీనా గుర్రపు జాతికి చెందినది. అయితే యూరోపియన్​ దేశాలలో కూడా ఈ పొట్టి గుర్రాలు కన్పిస్తాయి.

మార్వార్ హార్స్​ షోలో ప్రదర్శనకు తీసుకొచ్చిన గుర్రాలు

"రెండు వందల సంవత్సరాల క్రితం పాశ్యాత్య దేశాల బొగ్గు గనుల్లో ఫలాబెల్లా జాతి గుర్రాలని ఉపయోగించేవారు. గనులు ఇరుకుగా ఉండటం వల్ల ఈ గుర్రాలను ఉపయోగించి బొగ్గును వెలికితీసేవారు. అప్పట్లో ఈ గుర్రాల శరీరాకృతి బలంగా ఉండేది. రకరకాల మెషీన్లు పుట్టికొచ్చిన తర్వాత క్రమంగా ఈ గుర్రాల వినియోగం తగ్గిపోయింది. షోలో ప్రదర్శనలకు మాత్రమే ప్రస్తుతం వీటిని ఉపయోగిస్తున్నారు. ఐర్లాండ్​లో డాక్టర్​ వృత్తిలో ఉన్న నా సోదరుడు ఫలాబెల్లాను, అరేబియా గుర్రాలను తీసుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ గుర్రాలపై కస్టమ్​, ఇతర సుంకాలు ఎక్కవ విధిస్తున్నారు"
- హర్​ప్రీత్​ సింగ్ సిద్ధూ, పొట్టి గుర్రం యజమాని

27 నెలల మార్వారీ గుర్రాన్ని తీసుకుని వచ్చిన రిజ్వాన్..​ ఈ గుర్రం కోసం గంటన్నర నుంచి రెండు గంటలు కేటాయిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ గుర్రం ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరిగినట్లు అతడు తెలిపాడు. మార్వారీ గుర్రంలో ఎనిమిది నుంచి పది జాతులు ఉన్నాయని రిజ్వాన్ తెలిపాడు. వాటి ముక్కు, చెవులను బట్టి జాతిని గుర్తిస్తారని అతడు చెప్పాడు. పోటీకి వచ్చిన మరో వ్యక్తి నరేష్ గజ్ సింగ్​ మాట్లాడుతూ.. "ఈ హార్స్​ షో నిర్వహించటం వల్ల గుర్రపు పెంపకపుదారులకు ఎంతో మేలు జరిగింది. దీనివల్ల మార్వారీ జాతి గుర్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం వీటికి మంచి ధర పలుకుతుంది" అని ఆయన అన్నారు.

మార్వార్ హార్స్​ షోలో ప్రదర్శనకు తీసుకొచ్చిన గుర్రాలు

ABOUT THE AUTHOR

...view details