దేశంలోని రహదారుల నిర్మాణంలో సోమవారం సరికొత్త రికార్డు నమోదైంది. మహారాష్ట్రలోని సతారాలో 24 గంటల వ్యవధిలో 39.671 కిలోమీటర్ల పొడవైన రహదారి అందుబాటులోకి వచ్చింది.
అరుదైన విషయం..
ఇది ప్రపంచంలోనే అరుదైన విషయంగా భావిస్తున్నారు. గతంలో విజయ్పుర్- శోలాపుర్ మధ్య 18 గంటల సమయంలో 25.54 కి.మీ. పొడవైన రహదారిని నిర్మించగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదైంది. తాజాగా సతారా-పండర్పుర్ రహదారి వెడల్పు పనుల్లో భాగంగా పుసెగావ్-మహాసుర్నే మధ్య 39.671 కి.మీ. పొడవైన రోడ్డును ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభించి సోమవారం ఉదయం 7 గంటల కల్లా పూర్తి చేశారు.