తెలంగాణ

telangana

By

Published : May 13, 2021, 5:43 AM IST

ETV Bharat / bharat

'అవసరమైన దేశాలకు టీకాలను సరఫరా చేయండి'

అవసరమైన దేశాలకు కరోనా టీకాలను పంపిణీ చేయాలని ప్రపంచ దేశాలను కోరారు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​. వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం సెషన్​లో మాట్లాడిన గోయల్​.. భారత్​ త్వరలోనే కరోనా జయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కరోనా టీకా మేథోహక్కుల సంపత్తి రద్దు ప్రతిపాదనపై డబ్ల్యూటీఓ త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Piyush Goyal
పీయూష్​ గోయల్

కరోనా విజృంభిస్తున్న వేళ అవసరమైన దేశాలకు టీకాలను పంపిణీ చేయాలని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రపంచ దేశాలను కోరారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం గ్లోబల్‌ ట్రేడ్‌ అవుట్‌లుక్‌ సెషన్​లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత్​.. కరోనాను జయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు కొవిడ్‌ పోరాటంలో భారతదేశానికి తమ సంఘీభావం తెలపాలని ఆయన కోరారు.

భారత్‌.. ప్రపంచాన్ని వసుధైక కుటుంబంగా భావించి ఇతర దేశాలకు 67 మిలియన్ కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు అందించిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. అలాగే ప్రపంచ దేశాలు కూడా కొవిడ్‌పై పోరుకు వ్యాక్సిన్ల విషయంలో ఉదారత చూపాలని పేర్కొన్నారు. ప్రపంచ మేథో సంపత్తి హక్కులను భారత్​ గౌరవిస్తుందని, ఇకముందూ కొనసాగిస్తుందని చెప్పారు.

త్వరగా నిర్ణయం తీసుకోవాలి

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మేథో సంపత్తి హక్కుల రద్దు ప్రతిపాదనతో పాటు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, వ్యాక్సిన్​ తయారీకి అవసరమైన ముడి చమురు లభ్యతపై ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) త్వరగా నిర్ణయం తీసుకోవాలని గోయల్​ విజ్ఞప్తి చేశారు. 2020 అక్టోబర్​లో కరోనా నియంత్రణకు సంబంధించిన ట్రిప్స్​ ఒప్పందంలోని కొన్ని నిబంధనలను అమలు చేయడంపై డబ్ల్యూటీఓ సభ్యదేశాలకు సూచించే ప్రతిపాదనను ముందుంచాయి భారత్,​ దక్షిణాఫ్రికా దేశాలు.

ఇదీ చూడండి:జడ్జికి కొవిడ్.. కరోనాపై సుమోటో విచారణ వాయిదా

ABOUT THE AUTHOR

...view details