తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేమికుల రోజే కాదు... పెళ్లి రోజూ ఇవాళే! - ప్రపంచ వివాహ దినోత్సవం

ఫిబ్రవరి 14 అంటే.. అందరికీ టక్కున గుర్తొచ్చేది ప్రేమికుల రోజు. కానీ ఈ సంవత్సరం 'ప్రపంచ వివాహ దినోత్సవం' కూడా ఇదే రోజు వచ్చిందని మీకు తెలుసా?

World Marriage Day: A special day for your loved one
'ప్రపంచ వివాహ దినోత్సవం'- మీ భాగస్వామికి ప్రత్యేకమైన రోజు

By

Published : Feb 14, 2021, 1:00 PM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకొంటారు యువతీయువకులు. తమ కిష్టమైన వాళ్లతో మధుర జ్ఞాపకాలు కలకాలం గుర్తుండిపోయేలా గడుపుతారు. అయితే.. ఈ సంవత్సరం ప్రేమికుల రోజు, ప్రపంచ వివాహ దినోత్సరం రెండూ ఒకే రోజు వచ్చాయని కొంతమందికే తెలుసు. ఏటా ఫిబ్రవరి రెండో ఆదివారం ప్రపంచ వివాహ దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఈ రోజును దంపతులు ఒకరిపై ఒకరు నమ్మకానికి, త్యాగానికి, హద్దులులేని ఆనందానికి ప్రతీకగా భావిస్తుంటారు.

పెళ్లంటే..?

సామాజికంగా లేదా చట్టపరంగా ఒప్పందం ద్వారా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టడం. ఈ బంధంతో ఇరువురికీ కొన్ని హక్కులు, బాధ్యతలు మొదలవుతాయి.

దేవుడిచ్చిన వరంగా ..

వైవాహిక బంధం దృఢంగా ఉండాలంటే అనుసరించాల్సినవి ఎన్నో. అందులో కొన్ని:

  • ఒకరికి ఒకరు దేవుడిచ్చిన వరంగా దాంపత్య జీవితాన్ని ఓ పండుగలా ప్రతిరోజు ఆస్వాదించండి.
  • శుభకార్యాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలకు కలిసి వెళ్లండి.
  • ఒక దగ్గర కూర్చొని పెళ్లి ఫొటోలు చూసి, నాటి విశేషాలు గుర్తు తెచ్చుకోండి.
  • మీ పిల్లలకు మీరు ఎలా కలిశారో, ఎలా ప్రేమలో పడ్డారో చెప్పండి.
  • మీ భాగస్వామిలో మీకు నచ్చే గుణాన్ని పొగుడుతూ ఉండండి. ఐ లవ్​ యూ అని చెప్పండి.
  • క్యాండిల్​ లైట్​ వెలుగులో మీ భాగస్వామికి ఇష్టమైన వంటను కలిసి ఆస్వాదించండి.
  • మీ వివాహంపై మీ భాగస్వామికి ప్రేమ లేఖలు రాయండి.

భారత్​లోనే విడాకులు తక్కువ ..

ప్రపంచంలోనే అతి తక్కువ విడాకులు తక్కువ నమోదయ్యే దేశం భారత్. ఇక్కడ ప్రతి వెయ్యి జంటల్లో 13 జంటలు మాత్రమే విడాకుల వైపు మొగ్గుచూపుతున్నాయి.

విడాకుల సంఖ్య తక్కువ ఉండటానికి 5 కారణాలు

  • మహిళలకు భావప్రకటనా స్వేచ్ఛ లేకపోవడం.
  • సంతోషం కంటే సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం.
  • భారత్​లో విడాకుల ప్రక్రియ నెమ్మదిగా సాగటం.
  • చట్టబద్ధత కంటే నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం.
  • మతపరమైన అంశాలు.

ఇదీ చదవండి :ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.. ఎందుకైందంటే.?

ABOUT THE AUTHOR

...view details