తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశీయ ఉత్పత్తులకు ప్రపంచమే మార్కెట్​' - ఆత్మ నిర్భర్​ భారత్

భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచమే మార్కెట్‌ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌ను ప్రపంచం విశ్వసనీయ దేశంగా గుర్తిస్తోందని చెప్పారు. ఆత్మనిర్భర్​ భారత్​పై ప్రజలకుండే సందేహాలను త్వరలోనే నివృతి చేస్తామన్నారు.

World is our market: PM Modi's 'Aatmanirbhar Bharat' pitch
'దేశీయ ఉత్పత్తులుకు ప్రపంచమే ఓ మార్కెట్​'

By

Published : Jan 6, 2021, 5:13 AM IST

ప్రపంచం.. సరసమైన, మన్నికైన, ఉపయోగకరమైన వస్తువుల కోసం వెతుకుతున్న తరుణంలో.. దేశీయ ఉత్పత్తులే ఓ మార్కెట్‌ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌పై అభిప్రాయాలు వెల్లడించిన ప్రధాని.. ఇది ఓ ప్రమాణాలతో కూడిన కార్యక్రమం అని చెప్పారు. దేశ ప్రజలకు ఎంతో సత్తా ఉందని కొనియాడారు. భారత్‌ను ప్రపంచం విశ్వసనీయ దేశంగా గుర్తిస్తోందని ఆయన అన్నారు. ఈ రెండు అంశాల ఆధారంగా భారతదేశ నాణ్యమైన ఉత్పత్తులు ప్రపంచంలో మరింత విస్తరిస్తాయని ఆకాంక్షించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఇదే నిజమైన స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు.

ప్రపంచ మార్కెట్‌ను దేశ ఉత్పత్తులతో నింపడమే కాకుండా ప్రపంచ ప్రజల హృదయాలను కూడా గెలుచుకోవాలని భారత్‌ భావిస్తోందని చెప్పారు మోదీ. భారత్‌లో తయారీ ద్వారా ప్రపంచ డిమాండ్‌ను తట్టుకోవడం సహా.. ప్రపంచాన్నీ ఒప్పించవచ్చని అభిప్రాయపడ్డారు. తెలివి, నాణ్యతకు భారత్‌ కేంద్రం అని అభివర్ణించిన మోదీ.. దేశంలోని అంకుర పరిశ్రమల పనితీరు ఇక్కడి యువత నవకల్పనలకు అద్దం పడుతోందన్నారు. దేశంలో కొత్త ఉత్పత్తులు, సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు ప్రధాని.

ఇదీ చదవండి:'ఆ అనుమతులు వచ్చాకే సెంట్రల్​ విస్టా నిర్మాణం'

ABOUT THE AUTHOR

...view details