తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్.. ఇప్పుడు సరికొత్త లుక్​తో... - ప్రపంచంలోనే పెద్ద తపాలా కార్యాలయం

worlds highest post office: ఆ పోస్టాఫీస్​ నుంచి ఉత్తరాలు పంపించడాన్ని అందరూ ఇష్టపడతారు. పర్యటకులు అయితే కచ్చితంగా అక్కడ ఓ సెల్ఫీ తీసుకుంటారు. ఆ కార్యాలయం ఆకారం లెటర్ బాక్స్​లా ఉంటుంది. అదే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన తపాలా కార్యాలయం కూడా ఇదే. ఆ పోస్టాఫీస్ ఎక్కడుందో? దాని విశేషాలేంటో ఓ సారి తెలుసుకుందామా..

world's highest post office
ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్

By

Published : Jun 14, 2022, 5:54 PM IST

worlds highest post office: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీసు మన దేశంలోనే ఉంది. అదెక్కడంటే హిమాచల్​ప్రదేశ్​లోని లాహౌల్ స్పితి జిల్లాలోని హిక్కిం గ్రామంలో ఉంది. ఈ పోస్టాఫీసు లెటర్ బాక్స్ ఆకారంలో ఉంది. అందువల్ల పర్యటకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ తపాలా కార్యాలయం సముద్ర మట్టానికి 14,567 అడుగుల ఎత్తులో ఉంది.

ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్

ఇంతకు ముందు వరకు ఈ పోస్టాఫీసు ఓ పూరింట్లో ఉండేది. ఇటీవల పోస్ట్ బాక్స్ ఆకారంలో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీని వల్ల హిక్కిం గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పర్యటకులను ఈ పోస్టాఫీసు విశేషంగా ఆకట్టుకుంటోంది. స్పితి వ్యాలీలోని తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా హిక్కిం తపాలా కార్యాలయం మారిపోయింది. ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యటకులు ఈ పోస్టాఫీసును సందర్శిస్తున్నారు. కార్యాలయం వెలుపల కొన్ని సెల్ఫీ పాయింట్లను అధికారులు ఏర్పాటు చేశారు. హిక్కిం పోస్టాఫీసు ఫోటోలు.. స్పితి లోయ నుంచి అత్యధికంగా షేర్ అయిన ఫొటోలలో ఒకటిగా నిలిచాయని అధికారులు తెలిపారు.

మట్టి గోడతో ఉన్న హిక్కిం పాత పోస్టాఫీస్

ఇక్కడకు వచ్చే చాలా మంది పర్యటకులు అత్యంత ఎత్తులోని ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలు పంపడాన్ని గొప్ప అనుభూతిగా భావిస్తారు. అలాగే ఆ లెటర్​లను అందుకున్నవారు ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్ నుంచి లెటర్​ వచ్చిందని సంబర పడతారు. ఇటీవల ఈ పోస్టాఫీస్​ను హిమాచల్ గవర్నర్​ కూడా సందర్శించారు. స్పితి లోయకు ప్రధాన కేంద్రంగా ఉన్న కాజా పట్టణానికి ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలు తీసుకెళ్తారు.

ఆధునీకరించిన హిక్కిం తపాలా కార్యాలయం

ఇదీ చదవండి:అనారోగ్యంతో తల్లి మృతి.. డిప్రెషన్​లో కుమారుడు.. ఆ పనితో ఇప్పుడు హ్యాపీగా...

80 గంటలుగా బోరుబావిలోనే బాలుడు.. ఆరోగ్యం ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details