కొవిడ్-19 ముప్పు అధికంగా పొంచివున్నందున దేశంలోని మధుమేహులందరికీ తొలుత వ్యాక్సిన్ అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) డిమాండ్ చేసింది. అవసరమైతే వారికి మూడోడోసు (Booster Dose) కూడా అందించాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మధుమేహ (Diabetes) దినోత్సవం సందర్భంగా 10రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఐఎంఏ ప్రారంభించింది. దాదాపు 100కోట్ల మందికి మధుమేహంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఐఎంఏ వెల్లడించింది.
ఐడీఎఫ్ (International Diabetes Federation) నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది (2021)లోనే దాదాపు 67లక్షల మంది మరణానికి మధుమేహం కారణమయ్యింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 53కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 64 కోట్లకు.. 2045వచ్చేసరికి 78 కోట్లకు చేరుతుందని అంచనా. ఇక భారత్‌లోనూ ప్రస్తుతం 7.7కోట్ల మంది మధుమేహంతో బాధపడుతుండగా.. 2045నాటికి ఈ సంఖ్య 13 కోట్లకు పెరగవచ్చని అంచనా. భారత్‌లో పట్టణాలు, మెట్రోనగరాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఇదివరకు ఎన్నడూ లేనంత ఎక్కువగా మధుమేహం బారినపడుతున్నట్లు వెల్లడైంది. ఒత్తిడి, జంక్ ఫూడ్, ధూమపానం, మద్యం సేవించడం, సుదీర్ఘ సమయం కూర్చొనడం వంటి జీవన విధానంలో మార్పుల వల్ల ఇవి మరింత ఎక్కువ అవుతున్నట్లు పేర్కొంది.
మహిళల్లోనే ఎక్కువ..