తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్యాన్సర్​ ఆసుపత్రికి రూ.340 కోట్ల విరాళం

ఒడిశాలో ప్రపంచస్థాయి క్యాన్సర్‌ కేర్‌ ఆసుపత్రి ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్​ సోమవారం ఆమోదం తెలిపింది. ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు శుభ్రత్‌ బగ్చి, ఆయన భార్య సుస్మిత బగ్చిలు భారీ విరాళాలు అందించారు.

By

Published : Apr 13, 2021, 9:48 AM IST

shubrato bagchi and his wife donate rs.340 crore to cancer hospital in bhuvaneswar
శుభ్రత్‌ బగ్చి, ఆయన భార్య సుస్మిత బగ్చిలు రూ.340 కోట్ల విరాళం

భువనేశ్వర్‌లో ప్రపంచస్థాయి క్యాన్సర్‌ కేర్‌ ఆసుపత్రి ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్​ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు శుభ్రత్‌ బగ్చి, ఆయన భార్య సుస్మిత బగ్చిలు రూ.340 కోట్లను విరాళంగా ప్రకటించారు.

శుభ్రత్‌ బగ్చి నిధుల నుంచి రూ.210 కోట్లు, సుస్మిత నిధుల నుంచి రూ.130 కోట్లు కేటాయిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. భువనేశ్వర్‌ ఇన్ఫోసిటీ-2 వద్ద 20 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా కేటాయించనుంది. బెంగళూరుకు చెందిన శంకర క్యాన్సర్‌ ఆసుపత్రి సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఏర్పాటు కానున్న దీనికి బగ్చి-శంకర క్యాన్సర్‌ కేర్‌ ఆసుపత్రిగా నామకరణం చేశారు. 2024 నాటికి ఇది ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా స్టార్‌ హోటళ్లు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details