World Biggest Pen : సాధారణంగా పెన్నులు అంటే జేబులో పెట్టుకునేలా చిన్నగా ఉంటాయి. కానీ ఈ పెన్ను మాత్రం 20 అడుగుల పొడవు ఉంటుంది. దీంట్లో రికార్డర్‌తో పాటు సీసీటీవీ కెమెరా కూడా ఉంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ పెన్ను ప్రపంచంలోనే అతిపెద్దది అంటున్నారు రూపకర్త. ఇంత పెన్ను ఎలా రాస్తుంది? బొమ్మ పెన్ను అనుకునేరు.. చక్కగా రాస్తుందటా మరి ఆ పెన్ను కథేంటో చూద్దాం పదండి.
హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాకు చెందిన సంజీవ్ అట్రీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెన్నును తయారు చేశారు. 20 అడుగుల పొడవుతో 42 కిలోల బరువు గల ఈ పెన్నులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీంట్లో సౌండ్ రికార్డర్‌తో పాటు సీసీటీవీ కెమెరాను కూడా పెట్టారు. ఈ పెన్ను షో పీస్‌లా కాకుండా.. ఇంక్‌తో ఉందని చెప్పారు. చక్కగా రాస్తుందని వెల్లడించారు. శనివారం ప్రారంభించిన ఈ పెన్నును అట్రీ పాఠశాలలోని విద్యార్థులందరికీ అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
గపెన్నులో సౌండ్ సెన్సార్ ఉన్నందువల్ల.. ఉపాధ్యాయులు సెలవులో ఉన్నా పాఠాన్ని రికార్డు చేసి మొబైల్ నుంచి పంపితే ఈ పెన్ను బోధిస్తుందని వెల్లడించారు. ఈ పెన్నులో ఉన్న సీసీ కెమెరా వల్ల పాఠశాల సెక్యూరిటీకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పాఠశాలలో ప్రార్థనను పాడుతుందని.. సౌరశక్తితో చార్జ్ చేసుకునే సదుపాయం ఉందని వివరించారు. ఈ పెన్నును చెక్క, ఇనుముతో తయారు చేశానని.. దీనికి రూ. 45,000 ఖర్చు అయ్యిందని చెప్పారు. ఈ పెన్ను తయారీలో మరో ఆరుగురు ఉపాధ్యాయులు సహకారం అందించారని తెలిపారు. అంతకుముందు అతిపెద్ద పెన్ను రికార్డు హైదరాబాద్‌కు చెందిన ఆచార్య ముకునూరి శ్రీనివాస పేరిట ఉందని చెప్పారు. 18 అడుగుల పొడవు, 37 కిలోల బరువు గల ఆ పెన్ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుందని తెలిపారు.
ఇవీ చదవండి:దిల్లీకి నితీశ్.. ప్రతిపక్షాలను కూడగట్టడమే లక్ష్యంగా విస్తృత పర్యటన
దళిత ఉపాధ్యాయురాలిపై కుల వివక్ష.. అంగన్వాడీని కాన్వెంట్లా తీర్చిదిద్ది..