రెండు నెలల క్రితం ఆగిపోయిన అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర సభ్యలు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. లార్సెన్, టుబ్రో, టాటా కన్సల్టింగ్ సంస్థ ఇంజనీర్లతో చర్చించిన అనంతరం ఆలయ నమూనాకు తుది ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.
రామమందిర నిర్మాణ పనులు పునఃప్రారంభం - Work restarts at Ayodhya Ram temple site
ఎట్టకేలకు రామమందిర నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయి. రెండు నెలల క్రితం భూగర్భజల సమస్యతో ఆగిపోయిన ఆలయ పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి.

అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ప్రారంభం
పూజ చేసి, ఆలయ నిర్మాణ పనులను మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. ఆలయ స్థలంలో ఉన్న శిథిలాల్ని తొలగించడానకి 70 రోజులు పడుతుందని అన్నారు. పూజలో రామమందిర నిర్మాణ ప్యానెల్ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రామమందిర పునాది తుది నమూనా సిద్ధం