ప్రపంచంలోనే అతి పొడవైన గ్యాస్ పైపులైన్ పనులు ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని రామాయి పట్టి గ్రామంలో సోమవారం ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కింద గుజరాత్లోని కాండ్ల పోర్టు నుంచి గోరఖ్పుర్ వరకు 2,805 కిలోమీటర్ల మేర ఈ పైపులైన్ వేస్తున్నారు. 2024లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు.
రూ.10 వేల కోట్ల వ్యయం..
ఈ పథకం ద్వారా యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ లబ్ధి పొందనున్నాయి. ఈ ప్రాజెక్టులో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంయుక్తంగా రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటిలో ఇండియన్ ఆయిల్ 50 శాతం, మిగిలినవి 25 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి.