తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వర్క్​ఫ్రమ్​ హోం' క్యాన్సిల్.. 800 మంది ఉద్యోగులు రాజీనామా! - వైట్​హాట్​ జూనియర్​

Whitehat jr work from home jobs: కరోనా కారణంగా వర్క్​ఫ్రమ్​ హోంకు ప్రాధాన్యం పెరిగింది. చాలా సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచే పని కల్పించాయి. అయితే, కరోనా అదుపులో ఉండటం వల్ల పలు సంస్థలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలుస్తున్నాయి. కానీ, ఉద్యోగులు మాత్రం వర్క్​ఫ్రమ్​ హోంకే మొగ్గుచూపుతున్నారు. ఆఫీసుకు రావాలని సూచించిన ఓ ప్రముఖ సంస్థలో 800 మంది ఉద్యోగులు రాజీనామా సమర్పించారట.

WhiteHat
ఆఫీసు నుంచే విధులని చెప్పినందుకు 800 మంది రాజీనామా

By

Published : May 14, 2022, 7:00 AM IST

Whitehat jr work from home jobs: కరోనా వైరస్ అదుపులో ఉండటంతో పలు సంస్థలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలుస్తున్నాయి. కానీ ఉద్యోగులు మాత్రం వర్క్‌ఫ్రమ్ హోం వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సంస్థలు ఒత్తిడి చేస్తే.. వారు రాజీనామాకు వెనకాడటం లేదంటూ కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కోడింగ్ నైపుణ్యాలను నేర్పించే వైట్‌హ్యాట్ (WhiteHat Jr) సంస్థ కూడా ఇదే విధమైన సూచన చేసింది. దీంతో కంపెనీకి చెందిన 800 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు రాజీనామా సమర్పించారట. రెండు నెలల వ్యవధిలో రాజీనామా చేసిన వారంతా.. స్వచ్ఛందంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్తా కథనం వెల్లడించింది.

ఉద్యోగులంతా నెలరోజుల్లో తిరిగి కార్యాలయాలకు రావాలంటూ వైట్‌హ్యాట్‌ జూనియర్‌ మార్చి 18న సమాచారం అందించింది. ఇందుకు సిద్ధంగా లేని ఉద్యోగులు రాజీనామా సమర్పించడం మొదలుపెట్టారు. ఇలా రెండు నెలల్లోనే 800 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు సంస్థను వీడినట్లు సమాచారం. అయితే కొందరు ఉద్యోగులు మాత్రం ఇది ఖర్చు తగ్గించుకునే ప్రక్రియలో భాగమని అంటున్నారు. మున్ముందు మరిన్ని రాజీనామాలు వస్తాయని చెప్తున్నారు. దేశీయ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్‌.. వైట్‌హ్యాట్‌ను కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితులు మారాయని వారు వెల్లడించారు. వైట్ హాట్‌ వ్యవస్థాపకుడు కరణ్ బజాజ్ ఆధ్వర్యంలో సంస్థ నడిచినంత కాలం అంతా సజావుగానే ఉందన్నారు. 2020లో ఈ కొనుగోలు ఒప్పందం జరగ్గా.. 2021లో కరణ్ బజాజ్‌ సంస్థ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాగా, ప్రస్తుత పరిణామంపై సంస్థ స్పందించింది. 'సేల్స్, సపోర్ట్ విభాగాలకు చెందిన ఉద్యోగులను ఏప్రిల్‌ 18 నుంచి కార్యాలయాల్లో రిపోర్ట్ చేయమని చెప్పాం. మరికొందరు ఉద్యోగులకు మినహాయింపులు ఇచ్చాం. ఇక ఉపాధ్యాయులు ఇంటి నుంచే పనిచేస్తారు' అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉండగా ఇటీవల కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడంతో పలు టెక్‌ సంస్థలు హైబ్రిడ్‌ విధానాన్ని మొదలుపెట్టాయి. అయితే, కంపెనీకి వెళ్లి పనిచేసేందుకు సుముఖంగా లేని ఉద్యోగులు సంస్థనే వీడేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌లో కూడా ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి సుముఖంగా లేరని ఇటీవల వార్తలొచ్చాయి. వారానికి మూడు రోజులే రమన్నా కూడా వారు అంగీకరించడం లేదు. దాదాపు 76 శాతం మంది ఉద్యోగులు ఈ విధానం పట్ల అసంతృప్తిగా ఉన్నారని ఓ సర్వే వెల్లడించింది.

ఇదీ చూడండి:ఈపీఎఫ్‌ వడ్డీపై పన్ను.. ఎప్పుడంటే?

శాలరీ నిలిపివేసిన హెడ్​మాస్టర్​పై హైకోర్టు గరం.. నెలరోజులు సస్పెండ్

ABOUT THE AUTHOR

...view details