మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన 'ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్' పుస్తకంపై అప్పుడే స్పందించడం తొందరపాటే అవుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా అభిప్రాయానికి రావడం సరికాదన్నారు. తాను రాష్ట్రపతిగా వెళ్లాక పార్టీ వ్యవహారాలను చూడడంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా విఫలమయ్యారంటూ ప్రణబ్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. ఎంపీలకూ, మన్మోహన్‌కూ మధ్య వ్యక్తిగత సంప్రదింపులు ముగిసిపోవడం పార్టీ పతనానికి దారితీశాయని రాసుకొచ్చారు. రూపా పబ్లిషర్స్ దీన్ని వచ్చే జనవరిలో ప్రచురించనుంది.
'ప్రణబ్ పుస్తకంపై అప్పుడే అభిప్రాయానికి రాలేం' - the presidential year book
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన 'ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్' పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా అభిప్రాయానికి రావడం సరికాదన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రణబ్ తన ఆత్మకథలో పేర్కొన్న కొన్ని కీలక విషయాలు వెలుగుచూడటం రాజకీయంగా సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో పుస్తకంలోని కొన్ని కీలక విషయాలు వెలుగుచూడటం రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే, ఆ పుస్తకం ఇంకా విడుదల కాలేదని, అది పూర్తిగా చదవకుండా తాను ఎలాంటి వ్యాఖ్యా చేయదలుచుకోలేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. పుస్తకం పూర్తిగా చదవాల్సి ఉందని మరో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. ఆయన ఏ సందర్భంలో ఇవి రాయాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే పుస్తకాన్ని చదవాల్సి ఉందన్నారు.
ఇదీ చూడండి:కాంగ్రెస్ గురించి ప్రణబ్ ఆత్మకథలో ఏముంది?