కేరళలో మహిళా స్వయం సహాయక సంఘం, రాష్ట్ర మిషన్ అయిన కుడుంబశ్రీ.. కొత్తగా ఓ మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేసింది. కాసరగోడ్ జిల్లాలో ప్రారంభమైన ఈ వివాహ బ్యూరోకు ఇప్పుడు విశేష ఆదరణ లభిస్తోంది.
'కుడుంబశ్రీ' వివాహ వేదిక ప్రారంభమైన స్వల్పకాలంలోనే సుమారు 100 మందికిపైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది పురుషులే కావడం విశేషం. కాసరగోడ్ జిల్లాలోని కన్హంగాడ్, కల్లార్లోని ఈ మ్యారేజ్ బ్యూరో శాఖలను.. అన్నీ తామై కేవలం నలుగురు మహిళలే నిర్వహిస్తుండటం గమనార్హం.
నామమాత్ర ఫీజులతో..