తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బట్టలు లేకపోయినా మహిళలు బాగుంటారు'.. రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు - womens look good without wear anything

ప్రముఖ యోగా గురువు రామ్​ దేవ్​ బాబా మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే..

Baba Ramdev Controversial statements
Baba Ramdev Controversial statements

By

Published : Nov 25, 2022, 8:46 PM IST

రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా చిక్కుల్లో పడ్డారు. మహిళల వస్త్రధారణ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్రలో దుమారం రేపుతున్నాయి. ఈ శిబిరానికి వచ్చిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ భార్య అమృతా ఫడణవిస్ ముందే రామ్ ​దేవ్​ బాబా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ జరిగింది.. థానేలోని పతంజలి యోగా పీఠం, ముంబయి మహిళల పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగాసైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ భార్య అమృతా ఫడణవిస్ హాజరయ్యారు. ఈ యోగా శిబిరానికి మహిళలు యోగా డ్రెస్సుల్లో వచ్చారు. మహిళలకు ఏర్పాటు చేసిన యోగా శిక్షణా కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రత్యేక మీటింగ్ జరిగింది. అయితే వెంట వెంటనే ఇలా కార్యక్రమాలు జరగడం వల్ల మహిళలకు చీరలు ధరించే సమయం దొరకలేదు. ఈ పరిస్థితిపై మాట్లాడిన రామ్ దేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మహిళలనుద్దేశించి మాట్లాడూతూ.. 'మీరు చీరలు ధరించేందుకు టైమ్​ లేకపోవడం వల్ల.. ఇప్పుడైనా ఇంటికి వెళ్లి చీరలు ధరించి రావచ్చు. మహిళలు చీరల్లో, సల్వార్ సూట్స్‌లో బాగుంటారని.. తన కంటికైతే మహిళలు ఏం ధరించకోపోయినా బాగుంటారు' అని వ్యాఖ్యానించారు. దీంతో రామ్​దేవ్​ బాబాపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details