భారత సైన్యంలో మరో 147 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా దక్కింది. దీంతో ఈ హోదా దక్కిన మహిళా అధికారుల సంఖ్య 424కు చేరింది. ఈ మేరకు భారత సైన్యం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు కారణాల వల్ల కొద్దిమంది మహిళా అధికారుల ఫలితాలు నిలిపివేసినట్లు పేర్కొంది.
"సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా ఇస్తూ నూతన జాబితాను విడుదల చేశాం. 147 మందికి శాశ్వత కమిషన్ హోదా దక్కింది. మొత్తంగా 615 మంది అధికారుల్లో 424 మందికి ఈ హోదా దక్కడం గమనార్హం."