Women Wants Delivery on 22nd January : ఉత్తర్‌ప్రదేశ్‌లో చాలా మంది గర్భిణులు అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజునే తమకు ప్రసవం చేయాలని వైద్యులను కోరుతున్నారు. ఆ చరిత్రాత్మక రోజును చిరస్మరణీయంగా మలచుకోవాలని ఆశిస్తున్నారు. ఆ రోజున పిల్లలు పుడితే తమ ఇళ్లలో 'రామ్‌లల్లా'కి పునర్జన్మ లభించినంత పుణ్యంగా భావిస్తున్నారు కుటుంబసభ్యులు.
కాన్పుర్‌కు చెందిన ఓ గర్భిణీ జనవరి 22న తనకు ప్రసవం చేయాలని వైద్యులను కోరింది. శ్రీరాముడి తల్లి కౌశల్యను స్మరించుకుని తన ఇంట్లో 'రామ్‌లల్లా' పుట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇది విన్న సీనియర్ వైద్యురాలు సీమా ద్వివేదీ, ఆశ్చర్యానికి గురైరయ్యారు. ఆ రోజు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్న మహిళలందరికీ ఆపరేషన్ చేసేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
ఈ విషయంపై వైద్యురాలు సీమా ద్వివేదీ 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు. 'సాధారణంగా మా ఆస్పత్రిలో ప్రతిరోజూ 12 నుంచి 20 ప్రసవాలు జరుగుతాయి. జనవరి 22న మరిన్ని ఆపరేషన్లు చేయాల్సి వస్తే అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అయితే దీనికోసం గర్భిణుల ఆరోగ్య పరిస్థితి కూడా పరిగణలోకి తీసుకోవాలి' అని డాక్టర్ సీమా తెలిపారు. ప్రసవాలు చేసే సమయంలో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు.