తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ గ్రామంలో పిల్లలకు జన్మనివ్వడం నిషేధం.. ప్రసవిస్తే అంతే.. ఆ శాపమే కారణం..! - మధ్యప్రదేశ్​ లేటెస్ట్ అప్డేట్స్

ఎవరైనా తాము పుట్టిన ప్రదేశం గురించి గర్వంగా చెప్పుకుంటారు. తమ ఉనికిని చాటే ఆ ప్రదేశం గురించి అందరికి గొప్పగా చెబుతారు. అయితే మధ్యప్రదేశ్​లోని ఓ గ్రామ ప్రజలు మాత్రం తమ ఊరి పేరు చెప్పేందుకే భయపడుతారు. ఎందుకంటే..

woman cursed in madhyapradesh saka shyam village
woman cursed in madhyapradesh saka shyam village

By

Published : Nov 13, 2022, 10:53 AM IST

అంధ విశ్వాసాలు ఒక్కసారి ప్రబలితే అందులో నుంచి ఆ మనిషిని బయటకు తీయడం అసాధ్యం. తరతరాలుగా నాటుకుపోయిన అలాంటి కొన్ని మూఢనమ్మకాలను అనేక గ్రామాలు ఇంకా పాటిస్తున్నాయి. అలాంటి గ్రామమే మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఉంది. ఇక్కడి గ్రామ ప్రజలు ఇప్పటికీ ఓ శాపానికి భయపడూతూ జీవిస్తున్నారు.

సాధారణంగా మనల్ని ఎవరైనా జన్మ స్థలం లేదా సొంత గ్రామం గురించి అడిగితే ఫలానా ఊరు అని చెప్పుకుంటాం. కొంత మంది మాత్రం పుట్టిన ఊరిలోనే స్థిరపడి ఉంటారు. కానీ రాజ్‌గఢ్ జిల్లా సంకశ్యామ్​ గ్రామ ప్రజలు మాత్రం అందుకు భిన్నం. వారు తమ ఊరి పేరు చెప్పుకోవడానికే భయపడతారు. ఇంతలా వారు భయపడేది ఎందుకంటే..

పిల్లలతో తల్లులు

ఆ గ్రామంలో పిల్లల్ని కనడం నిషేధం. ఎవరైన గర్భం దాలిస్తే వారు ఊరి పొలిమేరలోనో లేకుంటే వేరే గ్రామానికి వెళ్లి పిల్లల్ని కనాలి. పొరపాటున గ్రామం​లో పురుడు పోసుకుంటే శిశువు మరణిస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. తమ ఊరికి శాపం ఉందని.. అందుకే ఆ గ్రామస్థులు ఊరు బయటే ప్రసవిస్తారు. వర్షాకాలంలోనైనా సరే టేకు ఆకుల పందిరి కింద, భారీ వర్షాలకు ఊరి సరిహద్దు బయట ఉన్న మైదానంలో పిల్లలకు జన్మనిస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసినా వారు పట్టించుకోరు అక్కడి గ్రామస్థులు.

పిల్లాడితో తల్లి

ఇప్పటికి ఆ ఊర్లో ఒక్క ఆస్పత్రి కూడా లేదంటే ఆశ్చర్యపోక తప్పదు. అంతే కాకుండా బాలింతలకు లేదా పిల్లల తల్లులకు ఇచ్చే ప్రభుత్వ సహాకారాలు సైతం ఈ గ్రామస్థులకు అందదు. కొంత మంది గర్భిణిలు తమకు ఏడోనెల పడగానే వెంటనే ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు.

ఇదీ చదవండి:'ఆ స్టేడియానికి మోదీ పేరు తీసేస్తాం.. 10లక్షల ఉద్యోగాలిస్తాం'.. కాంగ్రెస్ మేనిఫెస్టో

పాముతో వీరోచితంగా పోరాడి ముగ్గురు పిల్లల్ని కాపాడుకున్న శునకం

ABOUT THE AUTHOR

...view details